Mileage Bikes: కేవలం లీటర్ పెట్రోల్‌కు 110 కిలో మీటర్ల మైలేజీని ఇచ్చే బైక్స్‌ ఇవే..

Best Mileage Bikes In India: భారత్‌లో పెట్రోల్‌ ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా చిన్న బండా.. పెద్ద బండా అని చూడకుండా మంచి మైలేజీని ఇచ్చే బైక్‌లను కొనుగోలు చేయడం విశేషం..

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2022, 03:22 PM IST
  • కేవలం లీటర్ పెట్రోల్‌కు..
  • 110 కిలో మీటర్ల మైలేజీని TVS Sport ఇస్తుంది
  • మార్కెట్‌ దీని ధర రూ.60,000
Mileage Bikes: కేవలం లీటర్ పెట్రోల్‌కు 110 కిలో మీటర్ల మైలేజీని ఇచ్చే బైక్స్‌ ఇవే..

Best Mileage Bikes In India: భారత్‌లో పెట్రోల్‌ ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా చిన్న బండా.. పెద్ద బండా అని చూడకుండా మంచి మైలేజీని ఇచ్చే బైక్‌లను కొనుగోలు చేయడం విశేషం.. అయితే చాలా మంది ప్రస్తుతం ఏ బైక్‌ ఎంత మైలేజీని ఇస్తుందని విచ్చల విడిగా గూగుల్‌ సెర్చ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం బైక్ రైడింగ్ ఖర్చును తగ్గించుకునేందుకు.. పలు కంపెనీల బైక్‌లను తీసుకుంటున్నారు. అయితే పెట్రోల్ ధర పెరిగినా భారం పెరగకుండా.. లీటర్ పెట్రోల్‌కు 110 కిమీ మైలేజీని ఇచ్చే బైక్‌లు మార్కెట్‌ చాలా కంపెనీలు విక్రయిస్తున్నాయి. అయితే ఏ బైక్‌ ఎక్కువ మైలేజీని ఇస్తాయో తెలుసుకుందాం..

TVS Sport
ప్రస్తుతం మార్కెట్‌లో టీవీఎస్ స్పోర్ట్(TVS Sport)బైక్‌ ధర రూ.60,000 నుంచి రూ.66,000 మధ్య ఉంది. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్‌ తెగ ట్రెండింగ్‌లో ఉంది. మార్కెట్‌ ఈ బైక్‌లు పెద్ద ఎత్తున అమ్ముడు పోతున్నాయి. ఈ బైక్‌ 109సీసీ ఇంజన్‌తో 8.18బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయనుంది. అయితే  టీవీఎస్ తమ వెబ్‌ సైట్‌లో పేర్కొన్న విధంగా ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు110 కి.మీ వరకు మైలేజీని ఇవ్వనుంది.

Hero HF DELUXE
ప్రముఖ హీరో మోటార్‌సైకిల్‌ కంపెనీలో హెచ్‌ఎఫ్ డీలాక్స్‌ ఒకటి. దీని ధర మార్కెట్‌లో రూ. 56,070నుంచి రూ. 63,790 వరకు ఉంటుంది. ఇది 97.2సీసీ ఇంజన్ 5.9కిలోవాట్ పవర్‌తో మార్కెట్‌లో లభించనుంది. ఇక మైలేజీ విషయానికొస్తే.. లీటర్ పెట్రోల్‌కు 100 కి.మీ కంటే ఎక్కువ ఇవ్వగలదు. ఇది మార్కెట్‌ అధికంగా విక్రయిస్తు బైక్‌ల్లో రెండవది.

Bajaj Platina 100 CC
బజాజ్ ప్లాటినా మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర 53 వేల నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్లాటినా 100 102 cc 4-స్ట్రోక్, DTS-i, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో మార్కెట్‌లో విడుదలైంది. అంతేకాకుండా ఈ బైక్‌కు స్పీడ్ గేర్‌బాక్స్ కూడా కలదు. ఇది లీటర్ పెట్రోల్‌కు 75  కి.మీ కంటే ఎక్కువగా ఇవ్వగలదు.

Bajaj CT110X
బజాజ్ CT110X మార్కెట్‌లో రూ. 66 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇక  ఇంజిన్ విషయానికొస్తే.. CT110X 115.45cc కలిగి ఉంటుంది. 4 స్ట్రోక్, సింగిల్ ఇంజన్‌తో మార్కెట్‌లో లిభిస్తోంది. అంతేకాకుండా బజాజ్ ప్లాటినా లాగా ఇది కూడా స్పీడ్ గేర్‌బాక్స్‌తో.. లీటర్ పెట్రోల్‌కు 70 కి.మీ వరకు మైలేజీని ఇవ్వగలదు.

Also Read: Jabardasth Praveen : జబర్ధస్త్ ప్రవీణ్ ఇంట్లో విషాదం.. కోలుకోలేని దుఖంలో ప్రవీణ్

Also Read: Nassar: సినీ నటుడు నాజర్‌కు గాయాలు..ఆస్పత్రికి తరలింపు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News