Banks vs Post offices: ఫిక్స్డ్ డిపాజిట్ లేదా సేవింగ్స్‌లో బ్యాంక్స్ వర్సెస్ పోస్టాఫీసులు, ఏవి బెటర్

Banks vs Post offices: ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకలకు ఆదరణ పెరుగుతోంది. పూర్తిగా సురక్షితమే కాకుండా..మంచి రిటర్న్స్ అందిస్తుంటాయి. బ్యాంకులతో పోలిస్తే..పోస్టాఫీసు పథకాలు మంచివా కావా అనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 22, 2022, 11:20 PM IST
Banks vs Post offices: ఫిక్స్డ్ డిపాజిట్ లేదా సేవింగ్స్‌లో బ్యాంక్స్ వర్సెస్ పోస్టాఫీసులు, ఏవి బెటర్

వృద్ధాప్యంలో లేదా నిర్ణీత వయస్సు దాటాక పెద్దమొత్తంలో చేతికి డబ్బులు అందితే చాలా బాగుంటుంది కదూ. అందుకే పోస్టాఫీసు ఫథకాలు మంచి ప్రత్యామ్నాయాలుగా ఉంటున్నాయి. పోస్టాఫీసు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలతో కలిగే లాభాల గురించి తెలుసుకుందాం..

పోస్టాఫీసు పథకాలు చాలావరకూ బ్యాంకులతో పోలిస్తే బెస్ట్‌గా చెప్పవచ్చు. సెక్యూరిటీతో పాటు మంచి లాభాలుండే పెట్టుబడి విధానం కోసం ఆలోచిస్తుంటే..పోస్టాఫీసు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మంచి లాభాలిచ్చే స్కీమ్. ప్రభుత్వ గ్యారంటీతో పాటు రిటర్న్స్ బాగుంటాయి. అంటే బ్యాంకులతో పోలిస్తే వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. 

బ్యాంకులతో పోలిస్తే..పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం చాలా సులభం. ఇండియా పోస్ట్ వెబ్‌సై‌ట్‌లో పూర్తి వివరాలున్నాయి. పోస్టాఫీసులో 1,2,3,5 ఏళ్లకు ఎఫ్‌డి చేయించవచ్చు. 

పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్లకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. ఇందులో ఇన్వెస్టర్ల డబ్బు పూర్తిగా సురక్షితం. ఇందులో ఎఫ్‌డి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా చేయవచ్చు. 1 కంటే ఎక్కువ ఎఫ్‌డిలు చేయవచ్చు. ఎఫ్‌డిను జాయింట్ ఎక్కౌంట్ కూడా చేయవచ్చు. ఇందులో 5 ఏళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ కూడా సాధ్యమే.

పోస్టాఫీసులో చెక్ లేదా నగదుతో ఎఫ్‌డి చేయవచ్చు. ఇందులో కనీసం 1000 రూపాయల్నించి ఎంతైనా జమ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో 7 రోజుల్నించి ఏడాది వ్యవధికైతే 5.50 శాతం వడ్డీ లభిస్తుంది. 3 ఏళ్ల వరకూ ఇదే వడ్డీ లభిస్తుంది. 3-5 ఏళ్ల వరకైతే 6.70 శాతం వడ్డీ అందుతుంది. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వడ్డీ ఎక్కువగా ఉండటమే కాకుండా జీరో రిస్క్ ఉంటుంది. అదే సమయంలో బ్యాంకులతో పోలిస్తే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ.

Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 25 లక్షల వరకూ ప్రయోజనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News