Investment Tips: స్వల్పకాలంలో డబ్బులు సంపాదించే 4 ప్రధాన మార్గాలు

Investment Tips: స్వల్పకాలంలో డబ్బులు సంపాదించే మార్గాలు చాలానే ఉన్నాయి. కొన్నిచోట్ల మీరు పెట్టే పెట్టుబడి మీకు లాభాలు కురిపించవచ్చు. ఆ మార్గాలేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 30, 2022, 06:11 PM IST
Investment Tips: స్వల్పకాలంలో డబ్బులు సంపాదించే 4 ప్రధాన మార్గాలు

షేర్ మార్కెట్‌లో లాభాలు ఆర్జించేందుకు చాలా మార్గాలున్నాయి. షేర్ల ద్వారా మ్యూచ్యువల్ ఫండ్స్ ద్వారా ఇలా వివిధ మార్గాల్లో పెట్టుబడి ద్వారా స్వల్పకాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాందించవచ్చు.

ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. స్వల్పకాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే..ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ధనవంతులు కావాలని ఉంటుంది. అయితే ప్రయత్నించకుండా ఏదీ సాధ్యం కాదు. కొన్ని మార్గాల్లో పెట్టుబడి పెడితే తక్కువకాలంలో ఎక్కువ సంపాదించవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇందులో కొన్నిషార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. 

లిక్విడ్ ఫండ్స్

మీ డబ్బుల్ని లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. సేవింగ్ ఎక్కౌంట్‌తో పోలిస్తే ఇందులో కొద్దిగా రిటర్న్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే 91 రోజుల్లో మెచ్యూర్ అయ్యే మనీ మార్కెట్ సెక్యూరిటీస్‌లో పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడి సురక్షితం. ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. ఎప్పుడైనా వదిలేయవచ్చు. లిక్విడ్ ఫండ్స్‌పై ట్యాక్స్ మినహాయించుకుని 4 నుంచి 7 శాతం మధ్య రిటర్న్ ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్‌ను కనీసం 90 రోజుల కోసం చేయాల్సి ఉంటుంది. 

అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్

అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్ అనేది ఒక డెబ్ట్ ఫండ్. కంపెనీలు 3-6 నెలల వ్యవధికై రుణమిస్తుంటాయి. ఈ ఫండ్స్‌లో రుణ వ్యవధి తక్కువగా ఉంటుంది. అందుకే ఇందులో లిక్విడ్ ఫండ్‌తో పోలిస్తే కొద్గిగా రిస్క్ ఉంటుంది. కానీ పెట్టుబడి పెట్టేందుకు అతి తక్కువ రిస్క్ కలిగిన పథకం.  కొన్ని వారాల్నించి కొన్ని నెలలవరకూ డబ్బులు విడిగా పెట్టాలనుకునేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. కనీసం 3 నెలల కోసం పెట్టుబడి పెడితే రిస్క్ జీరో కావచ్చు.

మంకీ మార్కెట్ ఫండ్స్

రిస్క్ వ్యవహారంలో ఈ మ్యూచ్యువల్ ఫండ్స్ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రిస్క్ చాలా తక్కువ. సాధారణంగా మనీ మార్కెట్ ఫండ్ అనేది కాల్ మనీ మార్కెట్, కమర్షియల్ పేపర్, ట్రెజరీ బిల్, 3-12 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే బ్యాంక్ సీడీలో పెట్టుబడి పెట్టవచ్చు. డీఫాల్ట్ వడ్డీ ధరల్లో ఎగుడు దిగుడు ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ టెర్మ్ డిపాజిట్

పోస్ట్ ఆఫీస్ టెర్మ్ డిపాజిట్స్‌ను ఇంటికి సమీపంలో ఏదైనా పోస్టాఫీసులు వెళ్లి తీసుకోవచ్చు. భారత ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. ఇందులో 1 ఏడాది లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. పోస్టాపీసు పథకాల్లో జీరో రిస్క్ ఉండటమే కాకుండా రిటర్న్స్ గ్యారంటీ ఉంటుంది. అందుకే ఇటీవలి కాలంలో పోస్ట్ ఆఫీస్ పథకాలకు ఆదరణ పెరుగుతోంది.

Also read: Multibagger stocks: షేర్ వంద రూపాయలే..కానీ 5 కోట్లుగా మారిన లక్ష రూపాయలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News