FD Interest Rates: ఎఫ్‌డీలపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ చెల్లిస్తుందో తెలుసా

FD Interest Rates: రిస్క్ లేకుండా అధిక రిటర్న్స్ పొందాలంటే చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్ని ఆశ్రయిస్తుంటారు. అయితే అన్ని బ్యాంకుల్లో వడ్డీ ఒకేలా ఉండదు. ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ చెల్లిస్తుంటుంది. అందుకే ఎఫ్‌డి చేసే ముందు ఏ బ్యాంకులో వడ్డీ ఎంత ఉందో తెలుసుకోవాలి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 5, 2024, 10:29 AM IST
FD Interest Rates: ఎఫ్‌డీలపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ చెల్లిస్తుందో తెలుసా

FD Interest Rates in All Banks: ఇటీవలి కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచుతున్నాయి. దాంతో చాలామంది వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం వివిధ బ్యాంకుల్లో ఎఫ్‌డీలు గత ఏడాది మార్చ్ నెలలో 57.2 శాతముంటే డిసెంబర్ నాటికి 60.3 శాతమైంది. అదే సమయంలో ఇతర సేవింగ్ పధకాల్లో క్షీణత కన్పించింది. అధిక వడ్డీ ఇచ్చే వాటిలో డబ్బులు డిపాజిట్ చేస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. 

ఫిక్స్డ్ డిపాజిట్ అనేది దేశంలో అత్యంత ఎక్కువగా ఇష్టపడే, ఆసక్తి చూపించే ఇన్వెస్ట్‌మెంట్. దేశం మొత్తం మీద 2 కోట్ల 42 లక్షల ఎఫ్‌డీల్లో 103 లక్షల కోట్లు డిపాజిట్ అయున్నాయంటే క్రేజ్ ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. అంటే సరాసరిన ప్రతి ఎఫ్‌డీపై 4.25 లక్షలున్నాయి. ఇక ఏ బ్యాంకులో వడ్డీ ఏ మేరకు ఉందో తెలుసుకుందాం.

డీసీబీ బ్యాంకు 6 నెలల్నించి 1 ఏడాది వరకూ ఎఫ్‌డి పై 6.25-7.25 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అదే 1 ఏడాది నుంచి 2 ఏళ్ల వరకైతే 7.15 శాతం నుంచి 7.85 శాతం వడ్డీ అందిస్తోంది ఇక ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికైతే 7.25 నుంచి 7.65 శాతం వడ్డీ ఇస్తోంది. 

యాక్సిస్ బ్యాంక్ 6 నెలల్నించి 1 ఏడాది కాలపరిమితి ఎఫ్‌డీపై 5.75 నుంచి 6 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అదే 1-2 ఏళ్ల వరకైతే 6.70 నుంచి 7.20 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికైతే 7 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 6 నెలల్నించి 1 ఏడాది కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 4.50 -6 శాతం వడ్డీ ఇస్తుంటే 1-2 ఏళ్ల కాల వ్యవధిలో అయితే 6.60-7.25 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అదే ఐదేళ్లు అంతకంటే ఎక్కువైతే  7 శాతం వడ్డీ ఇస్తోంది. 

ఎస్ బ్యాంకు 6 నెలల్నించి 1 ఏడాది కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 5-6.35 శాతం వడ్డీ చెల్లిస్తుంటే 1-2 ఏళ్ల కాల వ్యవధి కలిగినవాటిపై 7.25-7.75 శాతం వడ్డీ ఇస్తోంది. ఇక ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికైతే 7-7.25 శాతం వడ్డీ ఇస్తోంది. 

ఐసీఐసీఐ బ్యాంకు  6 నెలల్నించి 1 ఏడాది కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 4.75-6 శాతం వడ్డీ, 1-2 ఏళ్ల కాలపరిమితి అయితే 6.70-7.20 శాతం, ఐదేళ్లు అంతకంటే ఎక్కువైతే 6.90-7 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 

కెనరా బ్యాంకు 6 నెలల్నించి 1 ఏడాది అయితే 6.15-6.25 శాతం వడ్డీ, 1-2 ఏళ్ల కాలానికైతే 6.85-7.25 శాతం వడ్డీ, ఐదేళ్లు అంతకంటే ఎక్కువైతే 6.70 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 

బ్యాంక్ ఆఫ్ బరోడా 6 నెలల్నించి 1 ఏడాది కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 5.60-7.10 శాతం వడ్డీని, 1-2 ఏళ్ల కాలానికైతే 6.85-7.10 శాతం వడ్డీని, ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికైతే 6.50 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 

ఎస్బీఐ బ్యాంకు 6 నెలల్నించి 1 ఏడాది కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 5.75-6 శాతం వడ్డీ, 1-2 ఏళ్లకైతే 6.80-7.10 శాతం వడ్డీ, ఐదేళ్లు అంతకంటే ఎక్కువ వ్యవధికైతే 6.50 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 

ఇక యూనియన్ బ్యాంక్ 6 నెలల్నించి 1 ఏడాది కాల వ్యవధి కలిగి ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.90-5.75 శాతం వడ్డీ, 1-2 ఏళ్ల కాల పరిమితికైతే 6.50-7.25 శాతం వడ్డీ, ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికైతే 6.50 శాతం వడ్డీని చెల్లిస్తోంది. 

Also Read: Flipkart UPI: ఫ్లిప్‌కార్ట్ నుంచి కొత్తగా యూపీఐ సేవలు ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News