Banking Rules: సేవింగ్ ఖాతాలో నగదు డిపాజిట్ ఎంత వరకూ ఉండొచ్చు, ఇన్‌కంటాక్స్ పడుతుందా లేదా

Banking Rules: దేశంలో దాదాపు అందరికీ సేవింగ్ ఎక్కౌంట్ ఉంటుంది. వివిధ నియంత్రణ సంస్థలు నిర్దేశించిన పరిమితులు, బ్యాంకింగ్, ఫైనాన్స్ సంబంధిత ఇన్‌కంటాక్స్ నిబంధనలు అర్ధం చేసుకోకపోతే సమస్యలు ఎదురౌతాయి. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 28, 2023, 11:49 AM IST
Banking Rules: సేవింగ్ ఖాతాలో నగదు డిపాజిట్ ఎంత వరకూ ఉండొచ్చు, ఇన్‌కంటాక్స్ పడుతుందా లేదా

Banking Rules: అదికారికంగా విడుదలైన ఇన్‌కంటాక్స్ మార్గదర్శకాల ప్రకారం సేవింగ్ బ్యాంక్ ఎక్కౌంట్ బ్యాలెన్స్ పెరిగితే ఇన్‌కంటాక్స్ కోతకు కారణం కావచ్చని తెలుస్తోంది. అందుకే ఆదాయానికి సంబంధించే కాకుండా సేవింగ్ ఎక్కౌంట్, క్యాష్ డిపాజిట్ లిమిట్స్  నిబంధనలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

సేవింగ్ ఎక్కౌంట్స్‌లో నగదు డిపాజిట్ పరిమితి దాటితే ట్యాక్స్ పరిధిలోకి వస్తుందనేది చాలామందికి తెలియని అంశం. సేవింగ్ ఎక్కౌంట్ హోల్డర్లు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఈ పరిమితి మనీ లాండరింగ్, పన్ను ఎగవేత నిరోధించడం, నగదు లావాదేవీలను అరికట్టేందుకు ఉపయోగపడుతుంది. అందుకే సేవింగ్ ఎక్కౌంట్‌ను తేలిగ్గా తీసుకోవద్దు పూర్తి వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. 

ప్రస్తుతం వ్యక్తిగతంగా సేవింగ్ ఎక్కౌంట్స్‌లో రోజుకు 1 లక్ష రూపాయల వరకూ డిపాజిట్ చేయవచ్చు. ఈ పరిమితి 2.5 లక్షల వరకూ విస్తరించే సందర్భాలు లేకపోలేదు. ఏడాది ఆధారంగా పరిగణించినప్పుడు సేవింగ్ ఎక్కౌంట్ గరిష్ట పరిమితి 10 లక్షల రూపాయలే ఉంటుంది. ఏడాది ఆధారంగా లెక్కేసినప్పుడు నగదు డిపాజిట్ పరిమితి 10 లక్షలు దాటనంతవరకూ ఇన్ కంటాక్స్ శాఖ నుంచి ఏ సమస్యా రాదు. ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఒకే ఆర్ధిక సంవత్సరంలో నగదు డిపాజిట్ 10 లక్షలు దాటితే సంబంధిత బ్యాంక్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే సేవింగ్స్ ఎక్కౌంట్స్‌లో ఉండే నగదు నిల్వలపై నేరుగా ట్యాక్స్ విధంచడమనేది ఉండదని గుర్తుంచుకోవాలి. ఈ నగదుపై లభించే వడ్డీపై పన్ను ఉంటుంది. వివిధ బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ సంస్థలు డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తుంటాయి. ఇదంతా ఎలా ఉన్నా ఏడాదిలో మొత్తం ఆదాయంపై మాత్రమే ఐటీ రిటర్న్స్ ఆధారంగా ట్యాక్స్ ఉంటుంది.

Also read: NTR Rs 100 Coin: ఎన్టీఆర్ స్మారక 100 రూపాయల నాణెం ఇవాళే విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News