Bank holidays: వచ్చే వారం 4 రోజులు బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం!

Bank holidays: వచ్చే వారం బ్యాంక్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశముంది. ఇందుకు కారణాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2021, 05:31 PM IST
  • వచ్చే వారం బ్యాంకులకు వరుస సెలవులు!
  • బ్యాంకింగ్ సంఘాల సమ్మె ప్రభావం
  • ప్రభుత్వం స్పందిస్తే సమ్మెపై వెనక్కి తగ్గే అవకాశం
Bank holidays: వచ్చే వారం 4 రోజులు బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం!

Bank holidays in December 2021: వచ్చే వారం మీకు బ్యాంకుల్లో ఏదైనా పని ఉందా? అయితే ఈ విషయాలు మీ కోసమే. బ్యాంకుల్లో మీరు పూర్తి చేయాలనుకున్న పనులను ముందస్తుగా ప్లాన్ చేసుకుని.. బ్యాంక్​కు వెళ్లడం బెటర్. ఎందుకంటే వచ్చే వారం బ్యాంకింగ్ (December Banking Alert) కార్యకలాపాలకు వరుసగా అంతరాయం ఏర్పడనుంది.

ప్రభుత్వం రంగ బ్యాంకుల కార్యకలాపాలు దాదాపు నాలుగు రోజులు పని (Banking services to Stop) చేయకపోవచ్చు. ప్రైవేటు బ్యాంకుల కూడా పలు సెలవులు ఉన్నాయి.

బ్యాంకుల సెలవులు ఇలా..

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు డిసెంబర్ 16 (గురువారం), 17 (శుక్రవారం) రోజుల్లో వర్కింగ్​ డేస్​ అయినప్పటికీ నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం బ్యాంక్​ సంఘాలు బంద్​కు పిలుపునివ్వడమే.

డిసెంబర్ 18(శనివారం)న సోసో థామ్ వర్ధంతి సందర్భంగా ఈ షిల్లాంగ్​ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. ఇక 19 (ఆదివారం) దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు సెలవులో ఉండనున్నాయి.

బంద్​ ఎందుకు?

ప్రభుత్వం రంగం బ్యాంకుల్లో రెండింటిని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని ప్రభుత్వం బడ్జెట్​ 2021-22లో కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్ సంఘాలు సమ్మె (Banks Strike) చేపట్టనున్నాయి.

యునైటెడ్​ ఫోరమ్​ ఆఫ్​ బ్యాంక్ యూనియన్​ (యూఎఫ్​బీయూ) ఈ మేరకు సమ్మెకు (UFBU calld for Banks Strike) పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించి గత వారమే నోటీసులు కూడా ఇచ్చాయి బ్యాంక్ యూనియన్లు. ప్రైవేటుకు బ్యాంకులను అప్పగించడం వల్ల బలహీన వర్గాలకు రుణాల లభ్యత తగ్గుతుందని.. కోట్లాది మంది డిపాజిట్లు రిస్క్​​లో పడతాయని బ్యాంకింగ్ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

Also read: PM Kisan Yojana: రైతులకు గుడ్ న్యూస్- ఈ నెల 25 లోపు ఖాతాల్లో రూ.2 వేలు!

Also read: Stock Market today: స్టాక్ మార్కెట్లకు స్వల్ప లాభాలు- 58,800 పైకి సెన్సెక్స్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News