Loan Interest Rate: ఈ బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. లోన్లపై వడ్డీ రేట్లు పెంపు..!

Bank Of Baroda Interest Rates: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్. లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ నెల 12 నుంచి పెంచిన రేట్లు అమలులోకి వస్తాయని పేర్కొంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2023, 06:25 AM IST
Loan Interest Rate: ఈ బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. లోన్లపై వడ్డీ రేట్లు పెంపు..!

Bank Of Baroda Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.25 శాతం పెంచడంతో ఆ భారాన్ని లోన్ తీసుకున్న ఖాతాదారులపైకి బ్యాంకులు మళ్లించనున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)తో అనుసంధానించిన రుణాల వడ్డీ రేటును పెంచింది. తాజాగా పెరిగిన రేట్లు ఈ నెల 12వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. కొత్త వడ్డీ రేట్లను బ్యాంక్ తన అధికార వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయనుంది. 

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.85 శాతం నుంచి 7.90 శాతానికి 5 బీపీఎస్ పెరిగిందని, ఒక నెల కాలవ్యవధిని 5 బీపీఎస్ నుంచి 8.20 శాతానికి పెంచినట్లు బ్యాంక్ వెల్లడించింది. అదేవిధంగా మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ను 8.25 శాతం నుంచి 8.30 శాతానికి, ఆరు నెలలకు 8.40 శాతానికి, ఏడాదికి 8.55 శాతానికి పెంచినట్లు తెలిపింది. ఎంసీఎల్‌ఆర్‌ పెంపుతో కార్పొరేట్ రుణగ్రహీతలపై ప్రభావం చూపనుంది. 

హౌసింగ్, పర్సనల్ లోన్లు, ఎస్‌ఎమ్ఈలతో సహా రిటైల్ రుణాలు కూడా వడ్డీని పెంచుతాయి. లోన్లపై వడ్డీ రేటు పెరిగితే.. బ్యాంకు రుణాలపై మార్క్-అప్‌లు/మార్జిన్‌లను తగ్గించకపోతే ఈఎంఐలు కూడా పెరుగుతాయి. లోన్ తీసుకున్న వాళ్లు ఎంసీఎల్ఆర్‌కు లింక్ అయిన లోన్‌ల కోసం చెల్లించే ఈఎంఐ కూడా పెరుగుతుంది. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా వరుసగా ఆరోసారి రెపో రేటును పెంచిన విషయం తెలిసిందే. 25 బేసిస్ పాయింట్లు పెంచగా.. 6.25 నుంచి 6.50 శాతానికి చేరింది. గతేడాది డిసెంబర్‌లో 35 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచింది. ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు ఈ పెంపునకు అనుకూలంగా ఓటు వేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హెచ్చు తగ్గులు, ద్రవ్యోల్బణం గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయని శక్తికాంత దాస్ అన్నారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. అయితే ప్రపంచ సవాళ్లు మన ముందు ఉన్నాయన్నారు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. 2023 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ 7 శాతంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు.  

Also Read: TSRTC: పెళ్లిళ్ల సీజన్‌లో టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. సూపర్ డిస్కౌంట్  

Also Read: MLC Kavitha: రూ.10 లక్షల కోట్లు ఆవిరి.. ఈ ప్రధాని అవసరమా..?: ఎమ్మెల్సీ కవిత  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News