FD Interest Rates: సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డిపై అత్యధిక వడ్డీ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే

FD Interest Rates: సీనియర్ సిటిజన్లకు, సాధారణ పౌరులకు రిస్క్ లేని బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే. ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ చెల్లిస్తుంటుంది. ఈ నేపధ్యంలో ఎఫ్‌డిలపై అత్యధిక వడ్డీ ఇస్తున్న టాప్ 5 బ్యాంకులేవో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 8, 2024, 03:47 PM IST
FD Interest Rates: సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డిపై అత్యధిక వడ్డీ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే

FD Interest Rates: మీరు ఒకవేళ సీనియర్ సిటిజన్ అయి ఉండి దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేస్తుంటే మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ అత్యుత్తమమైంది. ఎందుకంటే సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ చెల్లిస్తుంటాయి బ్యాంకులు. దేశంలో సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డిలపై అత్యధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల వివరాలు, వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

హెచ్‌డి ఎఫ్‌సి బ్యాంక్ సీనియర్ సిటిజన్ల పిక్స్ డిపాజిట్లపై 7.10  వడ్డీ ఇస్తోంది. 1 ఏడాది నుంచి 15 నెలల కాలపరిమితి ఎఫ్‌డిలకు ఇది వర్తిస్తుంది. అదే సమయంలో 15-18 నెలల ఎఫ్‌డిలపై 7.60 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక 18 నెలల్నించి 2 ఏళ్ల 11 నెలలకు అయితే 7.60 శాతం వడ్డీ ఇస్తోంది. 

ఇక ఐసీఐసీఐ బ్యాంకు 1 ఏడాది నుంచి 15 నెలల ఫిక్స్డ్ డిపాజిట్ సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ ఇస్తోంది. ఇక 15 నెలల్నించి 2 ఏళ్లకు అయితే  7.05 శాతం వడ్డీ ఇస్తోంది. 

ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 ఏడాది నుంచి 2 ఏళ్లకు 7.30 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అదే 2-3 ఏళ్ల ఎఫ్‌డిపై 7.5 శాతం వడ్డీ ఇస్తోంది. అమృత్ కలశ్ పధకంలో అయితే సీనియర్ సిటిజన్లకు 400 రోజుల ఎఫ్‌డిపై 7.60 శాతం వడ్డీ అందిస్తోంది. 

బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్లకు 1-2 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డిపై 7.35 శాతం వడ్డీ ఇస్తోంది. అదే 2-3 ఏళ్ల ఎఫ్‌డిపై 7.75 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 

ఇక కోటక్ మహీంద్ర బ్యాంక్ 390 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అదే 23 నెలల ఎఫ్‌డి అయితే 7.80 శాతం వడ్డీ ఇస్తోంది. 

Also read: Personal Loan Interest Rate: పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా, టాప్ 5 బ్యాంకులు, వడ్డీ రేట్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News