Bank Holidays from Today: ఈ రోజు నుండి వరుసగా 3 రోజులు బ్యాంకులకు సెలవులు

April 2023 Bank Holidays: బ్యాంకు సేవలకు వరుసగా మూడు రోజులు అంతరాయం కలగనుంది. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవు కాగా.. రేపు రెండో శనివారం, తరువాత ఆదివారం రావడంతో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఏప్రిల్ నెలలో మిగిలన రోజులు బ్యాంక్ హాలీ డేస్ ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2023, 08:15 PM IST
Bank Holidays from Today: ఈ రోజు నుండి వరుసగా 3 రోజులు బ్యాంకులకు సెలవులు

Bank Holidays in April 2023: బ్యాంక్‌ వినియోగదారులకు ముఖ్యగమనిక. బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. నేడు గుడ్‌ ఫ్రైడే సందర్భంగా బ్యాంక్ సేవలు బంద్ అయ్యాయి. రేపు రెండో శనివారం, తరువాత ఆదివారం కావడంతో వరుసగా హాలీ డేస్ వచ్చాయి. బ్యాంకింగ్ పనుల నిమిత్తం బ్యాంక్‌కు వెళ్లే వారు గుర్తుపెట్టుకోండి. లేకపోతే తీరా బ్యాంకుల వద్దకు వెళ్లి.. అయ్యో అనుకుంటూ వెనక్కి రావాల్సి రావచ్చు. ఏప్రిల్‌లో నెలలో మొత్తం 15 రోజులపాటు బ్యాంకులకు సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. 

గుడ్ ఫ్రైడే  సందర్భంగా శుక్రవారం లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్ తిరువనంతపురం, ఐజ్వాల్, బేలాపూర్ బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇంఫాల్, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా తదితర నగరాల్లో బ్యాంకులు బంద్ అయ్యాయి. రెండో శనివారం, ఆదివారం సెలవుల అనంతరం తిరిగి ఈ నెల 10 (సోమవారం)న బ్యాంకులు తెరుచుకోనున్నాయి. అగర్తల, అహ్మదాబాద్, గౌహతి, జైపూర్, జమ్మూ, సిమ్లా, శ్రీనగర్ ఈ నగరాల్లో మాత్రం నేడు బ్యాంకులు వర్క్ చేస్తున్నాయి. బ్యాంకులకు వరుస సెలవులు వచ్చిన నేపథ్యంలో మీరు యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్ ద్వారా నగదు లావాదేవీలు చేసుకోవచ్చు. 

ఈ నెలలో మిగిలిన రోజులు బ్యాంకుల సెలవులు ఇలా..

==> ఏప్రిల్ 14: బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐజ్వాల్, భోపాల్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, షిల్లాంగ్, సిమ్లా మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలీ డే ఉంటుంది. 
Also Read: KKR vs RCB Highlights: రూ.20 లక్షల ఆటగాడు.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ.. ఆర్‌సీబీపై విశ్మరూపం

==> ఏప్రిల్ 15: విషు, బోహాగ్ బిహు, హిమాచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ కారణంగా అగర్తల, గౌహతి, కొచ్చి, కోల్‌కతా, సిమ్లా, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. 
==> ఏప్రిల్ 16: ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు.
==> ఏప్రిల్ 18: షాబ్-ఎ-కద్రాలో జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులకు హాలీ డే. 
==> ఏప్రిల్ 21: ఈద్-ఉల్-ఫితర్ కారణంగా అగర్తల, జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురంలో బ్యాంకులు బంద్.  
==> ఏప్రిల్ 22: రంజాన్ ఈద్/నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. 
==> ఏప్రిల్ 23: ఆదివారం బ్యాంకులకు సెలవు.  
==> ఏప్రిల్ 30: ఆదివారం కారణంగా బ్యాంకులకు హాలీ డే.

Also Read: Bandi Sanjay Got Bail: బండి సంజయ్‌కి బెయిల్ మంజూరు.. కస్టడి పిటిషన్‌పై విచారణ వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News