Amazon mobile sale: అమెజాన్ భారీ ఆఫర్​- రూ.48 వేల స్మార్ట్​ఫోన్ రూ.27 వేలకే!

Best offers om Mobiles: స్మార్ట్​ఫోన్లపై అమెజాన్​ అదిరే ఆఫర్లు ప్రకటించింది. ఫ్లాగ్​షిప్​ మొబైల్​ డేస్ సేల్​లో భాగంగా భారీ తగ్గింపు ఇస్తోంది. ప్రీమియం ఫోన్లపై రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2021, 01:05 PM IST
  • మొబైల్ ఫోన్లపై అమెజాన్ ఆదిరే ఆఫర్లు
  • రూ.16 వేల వరకు డిస్కౌంట్​
  • ఎక్స్ఛేంజ్ ఆఫర్​ ద్వారా రూ.5 వేల వరకు ఆదా!
Amazon mobile sale: అమెజాన్ భారీ ఆఫర్​- రూ.48 వేల స్మార్ట్​ఫోన్ రూ.27 వేలకే!

Amazon offers on Premium Smartphones: కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఫ్లాగ్​షిప్​ మొబైల్ ఫోన్లను.. తక్కువ ధరలో కొనేందుకు బెస్ట్ డీల్స్ వచ్చేశాయి. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న ఫ్లాగ్​షిప్ మొబైల్ డేస్​ సేల్​లో (Amazon FlagShip Mobile sale) భాగంగా ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.

ఇందులో వివిధ రకాల మొబైల్ ఫోన్లపై భారీ తగ్గింపు ఇస్తోంది. ముఖ్యంగా మిడ్​రేంజ్​, ప్రీమియం సెగ్మెంట్​లోని షియోమీ మొబైళ్లపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తోంది అమెజాన్. ఈ ఆఫర్లను నేటితోనే ముగియనున్నాయి. మరి ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి.

షియోమీ 11 లైట్ ఎన్​ఈ 5జీ..

ఈ ఫోన్ అసలు ధర రూ.31,999 కాగా.. ఆఫర్​ ధరను (బ్యాంక్ ఆఫర్​తో కలిపి) రూ.22,999గా ఉంచింది అమెజాన్. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్​, ఈఎంఐ సదుపాయాలతో కొనుగోళ్లు జరిపే వారికి మాత్రమే ఈ ఆఫర్ (Amazon offer on Xiaomi 11 lite) వర్తిస్తుంది.

ఇదిలా ఉండగా... పాత ఫోన్​ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరో రూ.5000 వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది.

మీ 11 ఎక్స్ 5జీ..

ఈ మొబైల్ ఫోన్​పై దాదాపు రూ.11 వేల వరకు తగ్గింపు (బ్యాంక్ ఆఫర్​తో కలిపి) ఇస్తోంది అమెజాన్. దీని అసలు ధర రూ.33,999 కాగా రూ.22,999కే విక్రయిస్తున్నట్లు (Amazon offer on Mi 11 5G) తెలిపింది. ఐసీఐసీఐ డెబిట్​, క్రెడిట్ కార్టును ఉపయోగించి జరిపే లావాదేవీలకు మాత్రమే పూర్తి ఆఫర్ వర్తిస్తుంది.

మరోవైపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.5000 వరకు తగ్గింపును పొందొచ్చని వివరించింది.

మీ ఎక్స్​11 ప్రో 5జీ..

ఈ మొబైల్​పై ఏకంగా రూ.16,000 వేల వరకు తగ్గింపు ఇస్తోంది అమెజాన్. దీని అసలు ధర రూ.47,999గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ రూ.4000 కలుపుకుని.. ఈ మొబైల్​ను రూ.31,999కే విక్రయిస్తున్నట్లు (Amazon offer on Mi 11 Pro 5G) తెలిపింది.

ఎక్స్ఛేంజ్​ ద్వారా అదనంగా మరో రూ.5000 వేల వరకు ఆదా చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది.

షియోమీలోని బడ్జెట్ ఫోన్లపై కూడా ప్రత్యేక తగ్గింపు ఇస్తోంది అమెజాన్. ఎక్స్ఛేంజ్ ఆఫర్​తో పాటు భారీ క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది.

ఇతర ఫోన్లపై అమెజాన్ ఆఫర్లు..

శాంసంగ్ ఎం 32 5జీ మొబైల్​పై రూ.3 వేల వరకు తగ్గింపు ఇస్తోంది అమెజాన్​. 6 జీబీ ర్యామ్​, 128 స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 కాగా.. ఈ ఆఫర్లో దీని ధరను రూ.20,999గా ఉంచింది. వన్​ ప్లస్​, లావా సహా ఇతర బ్రాండ్ల మొబైళ్లపైనా డిస్కౌంట్ ఇస్తోంది.

Also read: LPG Booking Offer: పేటీఎంలో గ్యాస్ బుక్ చేస్తే రూ.2700 క్యాష్​బ్యాక్- పే లేటర్ ఆప్షన్​ కూడా!

Also read: SBI personal loan : సులువుగా పర్సనల్ లోన్, నిమిషాల్లో అకౌంట్లో డబ్బు జమ, ప్రాసెసింగ్ ఫీజు లేదు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News