Air India Deal: ఎయిర్ ఇండియా చరిత్రలో అతిపెద్ద డీల్, 5 వందల విమానాల కొనుగోలు

Air India Deal: ఎయిర్ ఇండియా చరిత్రలోనే అతి పెద్ద డీల్ కానుంది. భారీగా ఎయిర్‌క్రాఫ్ట్స్ కొనుగోలు చేయనుంది. ఇందులో పెద్ద, చిన్న ఎయిర్‌క్రాఫ్ట్స్ రెండూ ఉండటం విశేషం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 12, 2022, 12:41 AM IST
Air India Deal: ఎయిర్ ఇండియా చరిత్రలో అతిపెద్ద డీల్, 5 వందల విమానాల కొనుగోలు

ఎయిర్ ఇండియా త్వరలో 500 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే ఎయిర్ ఇండియా చరిత్రలో ఇదే అతిపెద్ద డీల్ కానుంది. ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

మీడియా నివేదికల ప్రకారం ఇప్పటివరకూ ఎయిర్‌బస్, బోయింగ్ ఈ డీల్ విషయంలో స్పష్టమైన సమాచారం లభించలేదు. టాటా గ్రూప్ తరపున నుంచి కూడా ఏ విధమైన ప్రకటన లేదు. ఎయిర్ ఇండియా త్వరలో కొనుగోలు చేయనున్న 500 విమానాల్లో 400 చిన్నవి కాగా 100 పెద్దవిగా తెలుస్తోంది. ఇందులో ఎయిర్‌బస్ ఎ350 ఎస్, బోయింగ్ 787 ఎస్, బోయింగ్ 777 ఎస్ ఆర్డర్ ఇచ్చే అవకాశాలున్నాయి.

ఎథిక్స్ ఆపరేటింగ్ ఫ్రేమ్‌వర్క్

ఎపెక్స్ ఎథిక్స్ కమిటిని ఉన్నత స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ దీనికి ఛీఫ్‌గా ఉంటారు. ఎయిర్‌లైన్ ఛీఫ్ ఎథిక్స్ అడ్వైజర్, ఛీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్, ఛీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. 

ఈ కమిటీ ఎథిక్స్ మార్గదర్శకాల్ని రూపొందిస్తుంది. ఎథిక్స్ సంబంధిత నిబంధనలు, ప్రణాళికలకు అనుమతి ఇస్తుంది. క్షేత్రస్థాయి ఎథిక్స్ కమిటీలకు గమ్యస్థానంగా పనిచేస్తాయి. 

Also read: IPO Updates: వచ్చేవారం 2 వేల కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమౌతున్న మూడు ఐపీవోలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News