Aadhaar Card, PAN Card Linking: ఆధార్ కార్డు, పాన్ కార్డుతో లింక్ చేయని వారికి ఎదురయ్యే సమస్యలు

Aadhaar Card, PAN Card Linking: ఆధార్ కార్డ్, పాన్ కార్డు లింక్ చేయడానికి ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా ఎన్నో సందర్భాల్లో తుది గడువును పొడిగించుకుంటూ వచ్చిన ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్.. ఈసారి ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ చెప్పినట్టుగానే జూన్ 30వ తేదీతో తుది గడువు ముగిసింది. జులై 1వ తేదీ నుంచి ఆధార్ కార్డు - పాన్ కార్డు లింక్ చేయని పాన్ కార్డులు ఇన్‌యాక్టివ్ అయిపోయాయి. మరి ఇప్పుడు వారి పరిస్థితేంటి ?

Written by - Pavan | Last Updated : Jul 12, 2023, 04:34 PM IST
Aadhaar Card, PAN Card Linking: ఆధార్ కార్డు, పాన్ కార్డుతో లింక్ చేయని వారికి ఎదురయ్యే సమస్యలు

Aadhaar Card, PAN Card Linking: ఆధార్ కార్డ్, పాన్ కార్డు లింక్ చేయడానికి జూన్ 30వ తేదీ వరకు గడువు విధించిన కేంద్ర ప్రభుత్వం.. ఆలోగా లింక్ చేసుకోని వారి పాన్ కార్డులు ఇన్‌యాక్టివ్ అవుతాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా ఎన్నో పర్యాయాలు ఈ తుది గడువును పొడిగించుకుంటూ వచ్చిన ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఈసారి ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో కేంద్రం ప్రకటించినట్టుగానే జులై 1వ తేదీ నుంచి ఆధార్ కార్డు - పాన్ కార్డు లింక్ చేయని పాన్ కార్డులు ఇన్‌యాక్టివ్ అయిపోయాయి. 

పాన్ కార్డు ఎందుకు తప్పనిసరి అంటే..
ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తులు, అప్పులు, పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలపై నిఘా పెడుతూ వారు కేంద్రానికి టాక్స్ చెల్లించారా లేదా ? లేక ఏమైనా టాక్స్ ఎగ్గొట్టారా అనే విషయాలు తెలుసుకునేందుకు ఈ పాన్ కార్డు నెంబర్ ఉపయోగపడుతుంది. 

ఆధార్ కార్డు - పాన్ కార్డు లింక్ చేయకపోతే ఏమవుతుంది ?
బ్యాంకు ఎకౌంట్ ఓపెన్ చేయాలంటే..
ఏదైనా బ్యాంకులో ఎకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న పాన్ కార్డుతో బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేయడం సాధ్యపడదు. బ్యాంకులు అందుకు అంగీకరించే అవకాశం లేదు. 

క్రెడిట్, డెబిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే..
క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే, దరఖాస్తుదారుల పాన్ కార్డు ఆధారంగానే వారి సిబిల్ స్కోర్ చెక్ చేసి క్రెడిట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పాన్ కార్డు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్టయితే, వారి కార్డును బ్యాంకులు స్వీకరించవు. అలాంటప్పుడు వారి క్రిడెట్ కార్డు అప్లికేషన్ కూడా రిజెక్ట్ అవుతాయి. సేమ్ రూల్ డెబిట్ కార్డు జారీ విషయంలోనూ వర్తిస్తుంది. కొత్త డెబిట్ కార్డు కావాలన్నా.. లేక పాత డెబిట్ కార్డును రెన్యువల్ చేసుకోవాలన్నా.. బ్యాంకులు ఇన్‌యాక్టివ్ డెబిట్ కార్డులను అంగీకరించవు.

లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే..
లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే... లోన్ అప్లికెంట్స్ పాన్ కార్డు ఆధారంగా వారి సిబిల్ స్కోర్ చెక్ చేసి దాని ఆధారంగా వారికి లోన్ ఇవ్వాలా లేదా ? ఒకవేళ లోన్ ఇస్తే ఎంత శాతం వడ్డీ రేటు చార్జ్ చేయాలి అనే విషయాలు నిర్ధారిస్తారు. ఒకవేళ పాన్ కార్డు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్టయితే, వారి పాన్ కార్డును బ్యాంకులు లోన్ అప్లికేషన్ కోసం స్వీకరించవు. అలాంటప్పుడు వారి లోన్ అప్లికేషన్ కూడా రిజెక్ట్ అవుతుంది. 

పెట్టుబడులు పెట్టేందుకు సమస్యే..
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే డిమాట్ ఖాతా తప్పనిసరి. కానీ పాన్ కార్డు లేకుంటే డిమాట్ ఖాతా అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా పాన్ కార్డు ఉన్నదే పెట్టుబడులను ట్రాక్ చేయడానికి. పాన్ కార్డు లేనప్పుడు పెట్టుబడులు పెట్టడం సాధ్యపడదు. ఒకవేళ మీకు ఇప్పటికే డీమాట్ ఖాతా ఉన్నప్పటికీ.. మీరు మీ ఆధార్, పాన్ నెంబర్ లింక్ చేయకపోతే.. మీ డీమాట్ ఖాతా స్తంబించిపోతుంది. ఆ ఖాకా ఆధారంగా ఎలాంటి లావాదేవీలు చేయలేరు.

రూ. 50 వేలకు మించిన పేమెంట్స్
50,000 రూపాయలకు మించిన చెల్లింపులు చేయాల్సిన సందర్భంలో కొన్ని సందర్భాల్లో మీ పాన్ కార్డు తప్పనిసరి అవుతుంది. అలాంటప్పుడు మీ పాన్ కార్డు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే ఆ చెల్లింపు సాధ్యపడదు. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్‌లోనూ ఈ రూల్ ఎప్పటి నుంచో అమలులో ఉన్న సంగతి తెలిసిందే.

విదేశీ పర్యటనలు లేదా విదేశీ కరెన్సీని మార్చుకోవాల్సిన అవసరం తలెత్తినప్పుడు పాన్ కార్డు తప్పనిసరి అవుతుంది.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలంటే పాన్ కార్డు తప్పనిసరి అవుతుంది. ప్రత్యేకించి మీ పెట్టుబడి రూ. 50 వేలు దాటితే, పాన్ కార్డు తప్పనిసరిగా కావాల్సిందే.

ఫిక్స్‌డ్ డిపాజిట్స్..
బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, కోపరేటివ్ బ్యాంక్, నాన్-బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపేనీలు.. ఇందులో ఎందులోనైనా రూ. 50 వేలకు మించిన ఫిక్స్‌డ్ డిపాజిట్స్ లావాదేవీలు చేయాలంటే వారి పాన్ కార్డ్ నెంబర్ తప్పనిసరి అనే విషయం మర్చిపోవద్దు.

ఇది కూడా చదవండి : iphone 14 Pro max Phone: ఈ ఐఫోన్ ధర రూ. 5 కోట్లు.. అంతలా ఏముంది ఇందులో ?

ఇన్సూరెన్స్ ప్రీమియం సంగతేంటి ?
ఒకే ఏడాదిలో ఒక వ్యక్తి చెల్లించే ఇన్సూరెన్స్ ప్రీమియం రూ. 50 వేలు దాటినట్టయితే.. వారి పాన్ కార్డు నెంబర్ తప్పనిసరి అవుతుంది. 

ఈ సమస్యల నుంచి బయటపడాలంటే.. ఆలస్యంగానైనా సరే.. జరిమానా చెల్లించి మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ ఇబ్బందులు తప్పవు.

ఇది కూడా చదవండి : Benefits of Filing ITR: ఐటి రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల కలిగే లాభాలు

ఇది కూడా చదవండి : Best Smartphones Under Rs. 10,000: రూ. 10 వేల కంటే తక్కువ ధరలో వచ్చే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News