Maharashtra: ఆ ఏటీఎంకు ఏమైందో గానీ అడిగినదానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వడం ప్రారంభించింది. 5 వందలు అడిగితే ఐదు రెట్లు ఎక్కువ ఇచ్చింది. అంతే ఇంకేముంది..జనం అక్కడికి ఎగబడ్డారు.
అడిగినదానికంటే ఎక్కువ ఇవ్వడమంటే ఇదేనేమో. మహారాష్ట్రలోని ఓ ఏటీఎం అడిగినదానికంటే ఎక్కువ డబ్బలు ఇవ్వడం ప్రారంభించింది. 5 వందలు అడిగితే ఐదు రెట్లు ఎక్కువ ఇవ్వడం ప్రారంభించింది. ఓ వ్యక్తి ఇలాగే 5 వందలు విత్‌డ్రా చేసేందుకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా ఖాపర్ ఖేడా పట్టణంలోని ప్రైవేటు బ్యాంకు ఏటీఎంను సందర్శించాడు. ఆశ్చర్యంగా 5 వందలకు బదులు..5 వందల నోట్లు ఐదు అంటే అడిగినదానికి రెట్టింపు నగదు వచ్చింది. ఆశ్చర్యపోయాడు..మళ్లీ ట్రై చేస్తే అలాగే వచ్చింది. అతని ఎక్కౌంట్ నుంచి డబ్బులు మాత్రం 5 వందలే కట్ అయినట్టు మెస్సేజ్ రావడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అలా..అలా ఈ వార్త ఊరంతా పాకేసింది.
ఇంకేముంది అడిగిందానికి ఐదు రెట్లు ఎక్కువ డబ్బు రావడంతో జనం ఎగబడ్డారు. అలా పోలీసులకు కూడా సమాచారం అందింది. బ్యాంకు అధికార్ల సహాయంతో ఏటీఎం కేంద్రాన్ని మూసేశారు. ఏటీఎంను పరిశీలించగా..మెషీన్ లోపలి భాగంలో వంద రూపాయల నోట్లు ఉంచాల్సిన ట్రేలో..5 వందల రూపాయల నోట్లను పొరపాటుగా ఉంచారు. ఫలితంగా ఐదు వందల నోట్లకు బదులు..ఐదు ఐదొందల నోట్లు రావడం ప్రారంభమైంది. ఏటీఎం కేంద్రాన్ని మూసేసి..ఎవరెవరు ఎంత డ్రా చేసుకున్నారో..ఏటీఎం కార్డు నెంబర్, సీసీటీవీ ఆధారంగా ఆరా తీసే పనిలో పడ్డారు బ్యాంకు సిబ్బంది.
Also read: Post Office Scheme: పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీమ్, 50 వేలు జమ చేస్తే చాలు..ప్రతినెల 33 వందల పెన్షన్
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook