7th Pay Commission Updates, Tamil Nadu Govt announces 4 percent DA Hike for employees: లక్షల మంది తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం 2023 కానుక లభించింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 4 శాతం పెంచింది. 2023 జనవరి 1నుంచి పెరిగిన జీతంను అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు పొందుతారు. ఈ పెంపును కొత్త ఏడాది తొలి రోజునే తమిళనాడు ప్రభుత్వం ప్రకటించి అందరినీ ఆనందంలో ముంచెత్తింది. ఉపాధ్యాయులు, పెన్షనర్లు సహా ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచుతున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
డియర్‌నెస్ అలవెన్స్ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. జనవరి నుంచే పెరిగిన జీతం ఉద్యోగుల ఖాతాల్లోకి చేరనుంది. ఇప్పటివరకు 34 శాతం డీఏ అందుకుంటున్న తమిళనాడు ఉద్యోగులు, పెన్షనర్లు.. ఇక నుంచి 38 శాతం అందుకోనున్నారు. డీఏ పెంపుతో రాష్ట్రంలోని 16 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. మరోవైపు లక్షలాది మంది పెన్షనర్లకు పెన్షన్ కూడా లభిస్తుంది.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 2,359 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని సమాచారం తెలుస్తోంది. డీఏ పెంపును 'కొత్త సంవత్సర కానుక'గా ముఖ్యమంత్రి స్టాలిన్ అభివర్ణించారు. ప్రజల సంక్షేమం, శ్రేయస్సు లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలకు ఉద్యోగులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగుల డీఏను పెంచబోతోందని సమాచారం. జనవరి నెలలోనే ఉద్యోగుల డీఏ పెంపును ప్రభుత్వం ప్రకటించవచ్చు. డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచవచ్చని అంచనా.
Also Read: Purse Vastu Tips: కొత్త ఏడాదిలో ఈ వస్తువులు పర్స్‌లో పెట్టుకుంటే.. ఏడాది పొడవునా డబ్బేడబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. 4 శాతం డీఏ పెంపు! జనవరి నుంచే పెరిగిన జీతం
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
4 శాతం డీఏ పెంపు
జనవరి నుంచే పెరిగిన జీతం