7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్త. జూలై 1 నుంచి డీఏ పెరగనుంది. డీఏ ఏకంగా 40 శాతానికి చేరుకోనుండటంతో భారీగా జీతాలు పెరగనున్నాయి. ఎప్పట్నించి పెరగనున్నాయో చూద్దాం..
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూసిన గుడ్ న్యూస్ వచ్చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఏకంగా 40 వేల రూపాయలు పెరగనుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కరవుభత్యం పెంచాల్సి ఉంది. ఏఐసీపీఐ వెల్లడించిన వివరాల ప్రకారం డీఏ 5 శాతం పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే మే నెల సూచీ పెరిగితే ఉద్యోగుల డీఏలో 6 శాతం పెరగుదల ఉంటుంది. డీఏ ఎంత పెరగనుంది, జీతం ఎంత పెరుగుతుందో చూద్దాం..
డీఏలో పెరుగుదల ఏఐసీపీఐ వివరాల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏఐసీపీఐ మార్చ్-ఏప్రిల్ సూచికలో పెరుగుదల చోటుచేసుకుంది. దాంతో 5 శాతం డీఏ పెరుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 34 శాతం నుంచి 39 శాతం పెరగనుంది. కానీ ఇప్పుడు కొత్త గణాంకాల ప్రకారం సిబ్బంది డీఏలో 6 శాతం పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
వాస్తవానికి ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల ఏఐసీపీఐ సూచికలో తగ్గుదల ఉంది. కానీ ఆ తరువాత సూచికలో పెరుగుతూ వచ్చింది. జనవరిలో 125.1, ఫిబ్రవిరోల 125 కాగా, మార్చ్ నెలలో ఒక అంకె పెరిగి 126కు చేరుకుంది. ఇప్పుడు ఏప్రిల్ నెల సూచిక వచ్చేసింది. ఏప్రిల్ సూచిక 127.7 గా ఉంది. ఇందులో 1.35 శాతం పెరగుదల నమోదైంది. ఇప్పుుడు మే నెల సూచిక వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఈ సూచికలో పెరగుదల ఉంటే డీఏలో 6 శాతం పెరుగుదల స్పష్టంగా ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం 6 శాతం డీఏ పెంచించే 34 నుంచి 40 శాతానికి చేరుకుంటుంది. ఫలితంగా అత్యధిక , కనీస జీతాలు ఎలా ఉంటాయో చూద్దాం..
అత్యధిక బేసిక్ శాలరీ ప్రకారం
సిబ్బంది కనీస వేతనం 56 , 900 రూపాయలు
కొత్త కరువు భత్యం 40 శాతం 22, 760 రూపాయలు
ప్రస్తుత కరవు భత్యం 34 శాతం 19,346 రూపాయలు
పెరిగిన డీఏ 3, 414 రూపాయలు
ఏడాదికి పెరిగిన మొత్తం 40 వేల 968 రూపాయలు.
కనీస బేసిక్ శాలరీ ప్రకారం
సిబ్బంది కనీస వేతనం 18,000
కొత్త కరవు భత్యం 40 శాతం 7, 200
ప్రస్తుత కరవు భత్యం 6,120
పెరిగిన డీఏ 1080
ఏడాదికి పెరిగిన డీఏ 12, 960
Also read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల మోత.. రూ.20 వేలు విలువ చేసే ఎల్‌ఈడీ టీవీ కేవలం రూ.2899కే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 40 వేలు పెరగనున్న జీతం