5G Smartphones Under 15000: దేశవ్యాప్తంగా 5జీ ఇంటర్నెట్ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. దాంతో ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా 5G స్మార్ట్‌ఫోన్ గురించి చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 5G స్మార్ట్ఫోన్లను (5g SmartPhone) మార్కెట్లోకి విడుదల చేశాయి. 5జీ ఇంటర్నెట్ సేవలు పొందాలంటే.. 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే లభిస్తాయి. కాబట్టి అందరూ ఇప్పుడు 4జీ స్మార్ట్ఫోన్లను వదిలేసి.. 5G స్మార్ట్ఫోన్ల వైపు వెళుతున్నారు. మీరు కూడా కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నారా? మరి ఆలస్యం ఎందుకు. 15 వేల కన్నా తక్కువ ధరలోనే 5G స్మార్ట్ఫోన్లు వచ్చేశాయి.
ప్రముఖ మొబైల్ సంస్థ వివో (Vivo) తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వివో వై35 5జీ (Vivo Y35 5G) స్మార్ట్‌ఫోన్‌ను వివో విడుదల చేసింది. ఈ ఫోన్లో పెద్ద స్క్రీన్, మంచి కెమెరా మరియు సూపర్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ కూడా చాలా బాగుంది. గత ఆగస్టులో ఆసియా దేశంలో ఈ ఫోన్ యొక్క 4G వేరియంట్‌ను విడుదల చేసింది. వివో వై35 5 ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లను ఇప్పుడు తెలుసుకుందాం.
వివో వై35 5జీ మూడు వేరియంట్లలో మార్కెట్లోకి రానుంది. ఇందులో 4 GB RAM + 128 GB స్టోరేజ్, 6 GB RAM + 128 GB స్టోరేజ్ మరియు 8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ధర వరుసగా 1199 యువాన్ (రూ. 14,138), 1399 యువాన్ (రూ. 16,521) మరియు 1499 యువాన్ (రూ. 17,672)గా ఉంది. ఈ ఫోన్ మూడు రంగులలో (బ్లాక్, బ్లూ మరియు గోల్డ్) అందుబాటులో ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లో ఈ ఫోన్ ఎప్పుడు విడుదల కానుందో ఇంకా సమాచారం లేదు.
వివో వై35 5జీ 6.5 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. 60HZ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 269 PPI పిక్సెల్ డెన్సిటీ, 120HZ టచ్ శాంప్లింగ్ రేట్, 720 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ Android 13 OS మరియు OriginOS ఓషన్ UIతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. స్టోరేజీని పెంచుకోవడానికి మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ కూడా అందుబాటులో ఉంటుంది. 13MP ప్రైమరీ సెన్సార్ మరియు 2MP మాక్రో లెన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లో LED ఫ్లాష్ కూడా అందుబాటులో ఉంది.
Also Read: Shani Dev Remedies: మీరు ఈ దేవతల భక్తులా.. అయితే శని దేవుడు ఎప్పుడూ మీ దరిదాపులకు కూడా రాడు!
Also Read: Shani Transit 2023: జనవరి 17న 'పంచ మహాపురుష రాజయోగం'.. ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.