Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో ప్రధాని మోదీ అందుకే భేటీ అయ్యారా ? జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ విశ్లేషణ

Pawan Kalyan Meeting With PM Modi : పవన్ కళ్యాణ్‌తో భేటీ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సర్కారుకైనా, ఏపీ ప్రజలకైనా ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు ? పవన్ కళ్యాణ్‌కి ఎలాంటి భరోసా ఇచ్చారనే అంశాలను మా జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ కూలంకషంగా విశ్లేషించారు. ఆ వీడియోను ఇప్పుడు చూద్దాం.

Written by - Pavan | Last Updated : Nov 13, 2022, 03:21 AM IST
  • ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన పవన్ కళ్యాణ్
  • పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీల భేటీకి అధిక ప్రాధాన్యత
  • అప్పుడు అడ్డుకున్న పోలీసులే ఇప్పుడు సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి
  • ఏపీలో అసలేం జరుగుతోంది ?
  • పవన్ కళ్యాణ్‌తో భేటీ ద్వారా ప్రధాని మోదీ ఏం చెప్పాలనుకున్నారు ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో ప్రధాని మోదీ అందుకే భేటీ అయ్యారా ? జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ విశ్లేషణ

Pawan Kalyan Meeting With PM Modi : పవన్ కళ్యాణ్.. ఈ పేరు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఒక హాట్ టాపిక్. ఆమాటకొస్తే పవన్ కళ్యాణ్ పేరు ఎప్పుడైనా హాట్ టాపికే.. కాకపోతే విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. జనసేనాని పవన్ కళ్యాణ్‌ని ప్రత్యేకంగా విశాఖకు పిలిపించుకుని, పవన్‌కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయనతో భేటీ అవడమే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో పవన్ కళ్యాణ్ స్థానాన్ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది. అన్నింటికిమించి.. కొద్దిరోజుల కిందటే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారు చేత, ఏపీ పోలీసుల చేత ఘోర పరాభవం ఎదుర్కొని హైదరాబాద్ వెనుదిరిగి రావాల్సి వచ్చిందో.. అదే విశాఖలో, అదే పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకుని ఎస్కార్ట్ భద్రత కల్పించి, వారే స్వయంగా దగ్గరుండి ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లాల్సి రావడం పవన్ కళ్యాణ్ స్థాయిని పెంచిన పరిణామమే అవుతుంది. ఈ పరిణామం అంటే గిట్టని వాళ్లు దీనికి వ్యతిరేకంగా, కథకథలుగా చెప్పుకున్నా.. బయటి ప్రపంచానికి కనిపిస్తున్న సీన్ మాత్రం పవన్ కళ్యాణ్‌ని కొంత గొప్పగా హైలైట్ చేసేదిగానే ఉంది.. మునుపటి కంటే హై లెవెల్లో ఎలివేట్ చేసేదిగానే ఉందనేది అక్షర సత్యం. 

ఏపీలో పర్యటన ముగించుకుని ఆ మరునాడే హైదరాబాద్‌కి కూడా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కావాలనుకుంటే పవన్ కళ్యాణ్‌ని హైదరాబాద్‌లోనే కలవొచ్చు కూడా. కానీ అలా జరగలేదు. దానికి కారణం ఏంటి ? అడక్కుండానే అపాయిట్మెంట్ ఇచ్చి వైజాగ్ పిలిపించుకుని అత్యంత సన్నిహితంగా మాట్లాడి పంపించడం వెనుక మోదీ అంతరంగం ఏంటి ? పవన్ కళ్యాణ్‌తో భేటీ ద్వారా నరేంద్ర మోదీ ఏపీ సర్కారుకైనా, ఏపీ ప్రజలకైనా ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు అనే అంశాలను మా జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ కూలంకషంగా విశ్లేషించారు. ఆ వీడియోను ఇప్పుడు చూద్దాం.

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపితో సానుకూలధోరణితో వెళ్తున్న వైసీపీకి ఒక రకంగా ఇది మింగుడుపడని పరిణామమే. అది కూడా ప్రధాని మోదీ విశాఖ సభకు తామే అన్నీ అయి ఏర్పాట్లు చేసి, చివరకు జన సమీకరణ వరకు సహకరిస్తే.. ప్రధాని మోదీ వచ్చి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత పెంచేలా ఆయనతో భేటీ అవడం ఏంటని ఏపీ అధికాక పార్టీ నేతలే ( YSRCP ) చెవులు కొరుక్కున్నట్టు తెలిసింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు, ఏపీ ఎన్నికల్లో ఏయే పార్టీలు కలిసి పొత్తులు పెట్టుకుంటాయో ఇంకా ఓ క్లారిటీకి రాకముందు చోటుచేసుకున్న ఈ పరిణామం ఎలాంటి మలుపులకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే మరి.

Also Read : Pawan Kalyan at Rushikonda: పవన్ కళ్యాణ్ రుషికొండ బీచ్‌‌కి వెళ్లింది అందుకేనా ?

Also Read : Pawan Kalyan Meet Modi: ప్రధాని మోదీని కలిసిన జనసేనాని.. ఫోటోస్‌ తెగ వైరల్‌..

Also Read : Case filed on Pawan: కొంప ముంచిన షో ఆఫ్.. కారెక్కిన పవన్ కళ్యాణ్ మీద కేసు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News