YS Sharmila: నేడే కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల.. కండీషన్స్ ఇవే..!

YS Sharmila Will Join Congress: కాంగ్రెస్ పార్టీలో చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరేందుకు బుధవారం ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పారు. పార్టీలో చేరికకు షర్మిల కొన్ని కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా మూడు ఆప్షన్లు షర్మిల ముందు ఉంచినట్లు సమాచారం.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2024, 12:24 AM IST
YS Sharmila: నేడే కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల.. కండీషన్స్ ఇవే..!

YS Sharmila Will Join Congress: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలన గద్దె దించడంలో వైఎస్సార్టీపీ చాలా పాత్ర పోషించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చాలా చోట్ల 10 వేల మెజారిటీతో గెలిచారని గుర్తు చేశారు. ఇందుకు కారణం తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయకపోవడమేనని పేర్కొన్నారు. తాను చేసిన త్యాగానికి విలువనిచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని.. ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. ప్రతి ఒక్కరికి భద్రత ఇచ్చే పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరుతున్నామని.. బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు.

బుధవారం కుటుంబ సమేతంగా విజయవాడకు వెళ్లనున్నారు వైఎస్. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసంలో సోదరుడు జగన్ మోహన్ రెడ్డిని కలిసి.. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు. అనంతరం సాయంత్రం విజయవాడ నుంచే నేరుగా ఢిల్లీకి పయనం కానున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కండువా కపుకోనున్నారు. తమ పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. 

షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం కొన్ని ఆఫర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. షర్మిలను తెలంగాణ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపీగా నామినేట్ చేసి.. పార్టీ విలీనం అనంతరం ఏఐసీసీ పగ్గాలు అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. లేదా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిలకు అప్పగించి.. కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయించడం. మూడోది ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమించడంతోపాటు రాజ్యసభ ఎంపీ పదవి ఇవ్వడం. షర్మిల ముందు ఈ మూడు ఆఫర్లు కాంగ్రెస్ హైకమాండ్ ఉంచినట్లు తెలుస్తోంది. 

షర్మిల కూడా కాంగ్రెస్‌ పార్టీ ముందు తమ కండీషన్లు పెట్టినట్లు తెలిసింది. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవాలంటే తాను కోరిన వాళ్లకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం. పొత్తులు, పార్టీకి సంబంధించిన నిర్ణయాల్లో తనకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. తన బాబాయ్ వివేకా కుమార్తె సునీతారెడ్డికి కూడా ఎంపీ టికెట్ ఇవ్వాలని.. కీలక నేతలను ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేర్చుకోవాలని షర్మిల కోరనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Yatra 2 Movie: యాత్ర-2 టీజర్‌ వచ్చేస్తోంది.. పోస్టర్ రిలీజ్

Also Read: Petrol And Oil Tankers: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల సమ్మె విరమణ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News