/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

MLC Anantha Babu:ఆంధ్రప్రదేశ్‌లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసు పెను సంచలనం సృష్టించింది.  ఎమ్మెల్సీ అనంతబాబు కారులోనే సుబ్రహ్మణ్యం డెడ్‌బాడీని వేసుకురావడం , వాళ్ల కుటుంబసభ్యులకు అప్పగించడం... ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏపీలో పెద్ద దుమారం రేపాయి. ఈ కేసులో అనంతబాబును అరెస్ట్ చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం ఆయనే డ్రైవర్‌ను చంపినట్లు స్పష్టంచేశారు. కోర్టు అనంతబాబుకు 14 రోజుల రిమాండ్‌ కూడా విధించింది. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ ఏపీలో రాజకీయ దుమారం రేపింది. హత్య చేసిన ఎమ్మెల్సీని వెంటనే పదవినుంచి తప్పించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించాయి. అరెస్ట్ సమయంలో పోలీసులు చెప్పిన కథనానికి.. నిజంగా జరిగినదానికి మధ్య పొంతన కుదరడం లేదని అనుమానపడ్డాయి. విపక్షాల ఆరోపణల నేపథ్యంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్టీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే ఆయన్ని ఎమ్మెల్సీ పదవినుంచి కూడా తొలగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉండటంతో ఈ విషయంలో నిర్ణయం ఆలస్యమవుతున్నట్లు సమాచారం. సీఎం దావోస్‌ నుంచి వచ్చిన వెంటనే అనంతబాబును ఎమ్మెల్సీ పదవినుంచి తొలగించే అవకాశమున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నెల 19 న ఎమ్మెల్సీ అనంతబాబు... తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో సుబ్రహ్మణ్యం చనిపోయాడు. అనంతరం తన కారులోనే శవాన్ని తీసుకెళ్లి కుటుంబసభ్యులకు అప్పగించాడు. యాక్సిడెంట్‌ అయ్యిందని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అయితే కుటుంబసభ్యులు నమ్మకపోవడంతో కారు అక్కడేవదిలేసి అనంతబాబు పరారయ్యారు. రెండు రోజుల డ్రామా అనంతరం ఎమ్మెల్సీ అనంతబాబే హత్య చేశాడని తేల్చారు పోలీసులు. 

Also read : Taneti Vanitha comments: కోనసీమ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టం..తానేటి వనిత కీలక వ్యాఖ్యలు..!

Also read : Pawan Kalyan On Amalapuram: ఎమ్మెల్సీ చేసిన హత్యను కవర్ చేయడానికే అల్లర్లు.. కోనసీమలో జగన్ చిచ్చుపెట్టారన్న పవన్ కళ్యాణ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
 

Section: 
English Title: 
YSRCP suspends MLC Ananthababu former driver murder case
News Source: 
Home Title: 

MLC Anantha Babu: మాజీ డ్రైవర్ హత్యకేసు, వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్

MLC Anantha Babu: మాజీ డ్రైవర్ హత్యకేసు, వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్
Caption: 
MLC Anantha Babu (File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఎమ్మెల్సీ అనంతబాబుపై వైసీపీ చర్యలు

పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం

రేపోమాపో ఎమ్మెల్సీ పదవీ ఊడే ఛాన్స్..!

Mobile Title: 
MLC Anantha Babu: మాజీ డ్రైవర్ హత్యకేసు, వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, May 25, 2022 - 21:10
Request Count: 
84
Is Breaking News: 
No