Ysrcp Plenary: వైసీపీ జీవిత కాల అధ్యక్షుడిగా సీఎం జగన్ ఎన్నికయ్యారు. గుంటూరు పార్టీ ప్లీనరీ సమావేశంలో తీర్మానం ఆమోదించారు. ఆ తర్వాత అధికారికంగా ప్రకటించారు. నిన్న వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. పారదర్శక పాలన-సామాజిక సాధికారత, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయంపై పలు తీర్మానాలు చేసి ఆమోదం తెలిపారు.
తీర్మానాల తర్వాత ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ముగింపు ప్రసంగం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్ధం పాటు ఎన్నో కష్టాలను భరించి, అవమానాలు తట్టుకుని నిలబట్టామని చెప్పారు. తన వెంట ఉన్న నేతలు, కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. మూడేళ్ల పాలనలో ఎన్నో చేశామని..ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ పథకాలు తీసుకెళ్లామని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు తనను టార్గెట్ చేశాయని..తనపై కేసులు పెట్టించాయని గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించారని చెప్పారు. ఏపీకి అన్యాయం చేసిన పార్టీలు నామరూపాలు లేకుండా పోయాయన్నారు సీఎం జగన్. 2014లో వైసీపీ ఓడినా తనపై టార్గెట్ చేశారని.
23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు లాక్కుకున్నారని..కానీ చివరకు వారికి మిగిలింది అదే సంఖ్యనేని చెప్పారు. ఇదంతా దేవుడి స్క్రిప్ట్నేనని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్నిసంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తామని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ తప్పక విజయం సాధిస్తామన్నారు సీఎం జగన్. ప్రతి ఒక్క నేత,కార్యకర్త ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు.
Also read:Atchannaidu on CM Jagan: ఆయనో సామాజిక న్యాయ విద్రోహి..సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు ప్రశ్నలు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook