Escientia Pharma Incident: కాలం.. పరిస్థితులు ఎంతలా మారిపోతాయో ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రిగా అడుగుపెట్టాల్సిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిగా అడుగుపెడుతున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానన్న నగరంలోనే మాజీ సీఎంగా పర్యటించబోతున్నారు. మూడు రాజధానుల్లో ఒకటైన కార్యనిర్వాహక రాజధాని చేస్తానని చెప్పిన నగరంలో ఇప్పుడు సాదాసీదాగా పర్యటన చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు నెలల కాల చక్రం గిర్రున తిరిగింది. విశాఖ సమీపంలోని అచ్యుతాపురంలో జరిగిన ప్రమాద బాధితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన విశాఖపట్టణం పర్యటన చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.
Also Read: Atchutapuram SEZ: ఏపీలో ఘోర విషాదం.. 18కి చేరిన మృతులు.. మరింత పెరిగే అవకాశం?
అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులు 45 మందికిపైగా అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ క్షతగాత్రులను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. మృతి చెందిన బాధిత కుటుంబసభ్యులను కూడా పరామర్శించి భరోసా ఇచ్చే అవకాశం ఉంది. ఇక సెజ్‌లో పేలుడు జరిగిన కంపెనీ స్థలాన్ని కూడా పరిశీలించనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Tirumala Water Problem: తిరుమలలో నీటి సంక్షోభం.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు
షెడ్యూల్ ఇదే
విశాఖపట్టణం పర్యటనకు మాజీ సీఎం జగన్ తన నివాసం నుంచి బయల్దేరనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో విశాఖకు చేరుకుంటారు. 10 గంటలకు విశాఖకు చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకుంటారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాజీ సీఎం జగన్ మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకోనున్నారు. వారిని పరామర్శించిన అనంతరం తిరిగి తాడేపల్లికి తిరుగు పయనమవుతారు.
ప్రమాణం చేస్తానన్న చోట..
అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ మూడు రాజధానులు ప్రకటించారు. వాటిలో భాగంగా విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే రిషికొండపై భారీ భవన సముదాయం నిర్మించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణం చేస్తానని చెప్పిన వైఎస్ జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయి మాజీ సీఎంగా విశాఖలో అడుగుపెట్టనుండడం ఆసక్తికరం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter