రేపే సచివాలయంలో సీఎం జగన్ ఎంట్రీ; ఆర్భాటాలకు దూరం..పాలన మరింత వేగవంతం

వైఎస్ జగన్ ఏపీ సచివాలయంలో సీఎం హోదాలో తొలిసారిగా అడుగుపెట్టనున్నారు

Last Updated : Jun 7, 2019, 04:55 PM IST
రేపే సచివాలయంలో సీఎం జగన్ ఎంట్రీ; ఆర్భాటాలకు దూరం..పాలన మరింత వేగవంతం

ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలి సారిగా సెక్రటేరియట్ లో అడుపెడుతున్నారు. దీనికి సంబంధించిన ముహుర్తం ఖరారైంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం శనివారం (రేపు ) ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌ లో సీఎం ఛాంబర్ నుంచి వైఎస్ జగన్ తన అధికారిక  కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. 

సింపుల్ గా ఏర్పాట్లు..
మరోవైపు సీఎం రాక సందర్భంగా దీనికి సంబంధించిన ఏర్పాట్లను సిద్ధం చేశారు. సీఎం జగన్ కు ఆహ్వానం పలికేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు. తన ఆఫీస్‌లో హంగూ ఆర్భాటాలేవీ ఉండొద్దని ముందే చెప్పిన వైఎస్ జగన్... అత్యంత సాదాసీదాగా అది ఉండేలా చెయ్యాలని ఆదేశించినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లుగానే సింపుల్‌గా ఏర్పాట్లు చేశారని తెలిసింది. 

రేపే మంత్రుల చేత ప్రమాణస్వీకారం...
ఇదిలా ఉండగా శనివారం ఉదయమే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సచివాలయం సమీపంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మంత్రిపదవులు దక్కించుకున్న వారికి ఫోన్లు చేసి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఉదయం 11.49 గంటలకు ఉండనుంది. ఇదిలా ఉండగా మంత్రులు ప్రమాణస్వీకారోత్సవానికి సుమారు 2 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రతా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం జగన్ కేబినెట్‌ తొలి భేటీ నిర్వహించనున్నట్లు తెలిసింది.

ఇక నుంచి మరింత దూకుడు...
ప్రమాణస్వీకారం చేసిన చేసినప్పటి నుంచి తాడేపల్లిలోని తన నివాసం నుంచి తన అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చిన జగన్.. వివిధ శాఖలకు సంబంధించి సమీక్షల మీద సమీక్షలు నిర్వహించారు. ఇదే క్రమంలో అధికారుల బదిలీలు కూడా చకచక పూర్తి చేశారు. రేపటి నుంచి సచివాలయంలో అడుపెట్టనున్న సీఎం జగన్ పాలన   వ్యవహారాల్లో మరింత దూకుడుగా వ్యవహరించనున్నట్లు టాక్. మంత్రివర్గ సహచరులతో కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కోసం సీఎం జగన్ తన కార్యకలాపాలు మరింత వేగవంతం చేయనున్నట్లు రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి.

Trending News