COVID-19 patients: కరోనావైరస్‌తో బాధపడుతున్న ప్రతీ పేషెంట్‌కి కచ్చితంగా ఒక అరగంటలోపు కొవిడ్-19 ఆస్పత్రుల్లో బెడ్ కేటాయించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. '' నాకు ఎంత ప్రయత్నించినా ఆస్పత్రులలో బెడ్ లభించడం లేదు అనే మాట కొవిడ్-19 పేషెంట్స్ నుంచి ఎక్కడా కూడా వినిపించకూడదు'' అని ఆయన జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు తేల్చిచెప్పారు. ఒకవేళ అలాంటి ఆరోపణలు ఎక్కడైనా వినపడితే... కొవిడ్-19 కేర్‌ని ( COVID-19 care ) పరిశీలిస్తున్న జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో.. వాళ్లే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని సీఎం జగన్ హెచ్చరించారు. అంతేకాకుండా కరోనా రోగికి ఆస్పత్రిలో బెడ్ నిరాకరించడం అనేది అత్యంత నేరంగా పరిగణించాల్సి ఉంటుందని సీఎం జగన్ పునరుద్ఘాటించారు. Also read: Jackfruit benefits: పనస పండుతో ప్రయోజనాలు.. మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం
పేషంట్ కోవిడ్ కేర్ ఆస్పత్రికి వెళితే "బెడ్ లేదు" అనే మాట ఎట్టిపరిస్థితుల్లో రాకూడదు. ఎవరైనా పేషంట్ "నాకు బెడ్ దొరకలేదు" అంటే అది మన మానవత్వం మీద ప్రశ్నే అవుతుంది... pic.twitter.com/6mtmRpODO7
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2020
కరోనావైరస్ సోకిన ఒక రోగికి బెడ్ లభించడం లేదు అనే మాట వచ్చిందంటే... అక్కడే మానవత్వం ( Humanity ) నశించిందని భావించాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తంచేసిన సీఎం జగన్ ( AP CM YS Jagan ).. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఆయా కొవిడ్-19 ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది మానవత్వాన్ని చాటుకోవాల్సి ఉంటుందని సూచించారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. Also read: COVID19: ఏపీలో 24 గంటల్లో 58 కరోనా మరణాలు