Kadapa MP Avinash Reddy tested Covid-19: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( coronavirus ) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సాధారణ ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అధికారపార్టీ వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ( Y. S. Avinash Reddy ) కి సైతం కరోనా సోకింది. దీంతో వెంటనే అవినాష్ రెడ్డి హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అయితే.. తన వెంట గత కొన్నిరోజుల నుంచి తిరుగుతున్న వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు. Also read: మరో YSRCP ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి (సెప్టెంబరు 2న) సందర్భంగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి సెప్టెంబరు 1, 2 తేదీల్లో ఇడుపుల పాయలో పర్యటించనున్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వైఎస్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మీడియా ప్రతినిధులకు వైద్యులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ వచ్చిందని పేర్కొంటున్నారు. Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు