Chandrababu: ఎన్నికల ప్రచారం ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా సాగుతోంది. అధికార పార్టీ దూసుకెళ్తుండగా.. అంతే దీటుగా టీడీపీ ప్రచారం చేస్తోంది. ప్రచారంలో భాగంగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు తాను పరమశివుడిగా అభివర్ణించారు. ఏపీ ప్రజలను కాపాడేందుకు శివుడి అవతారమెత్తినట్లు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Also Read: Pawan Kalyan Fever: పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. యాత్రను వదిలేసి హుటాహుటిన హైదరాబాద్‌కు
ప్రజాగళం రెండో విడత కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేపట్టారు. కొత్తపేటలో బుధవారం జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చేసిన 'పశుపతి' వ్యాఖ్యలపై స్పందిస్తూ.. 'జగన్ నన్ను పశుపతి అని విమర్శించాడు. ఆ వ్యాఖ్యలను విని నేను నవ్వుకున్నా. ఎందుకంటే పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడేందుకు వచ్చిన పరమశివుడు. గరళాన్ని గొంతులో పెట్టుకుని మానవాళిని కాపాడాడు. పశువపతి వ్యాఖ్యలను అంగీకరిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నేను శివుడి అవతారమెత్తా' అంటూ ప్రకటించారు. ఈ సందర్భంగా తనపై జరిగిన అవమానాలు, దాడులను గుర్తుచేసుకుని మాట్లాడారు.
Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు
'నాపై ఎన్నో రకాల దాడులు చేశారు. రాజకీయంగా.. కుటుంబపరంగా దాడులు అవహేళనలు చేశారు. పవన్ కల్యాణ్‌పై కూడా నిందలేశారు. అన్ని రకాల అవమానాలను భరించాం. ఒకే నిబద్ధత.. ఒకే ఆలోచనతో నిలబడ్డాం. తెలుగు జాతిని కాపాడుకోవాలనే లక్ష్యంతో అన్ని దాడులను ఎదుర్కొన్నాం. బుల్లెట్ మాదిరిగా దూసుకెళ్తాం' అని చంద్రబాబు తెలిపారు. ప్రశాంతతకు మారుపేరయినా కోనసీమలో ఎప్పుడైనా హింస జరిగిందా? ప్రశ్నించారు.
'కానీ జగన్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్ట్‌లు జరుగుతున్నాయి' అని తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజల కోసమే కలిశాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని.. రాష్ట్రానికి పట్టిన శని పోవాలని పవన్ మొదటి నుంచి ఒకేమాటపై ఉన్నారని వివరించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం.. రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టడం కోసం పొత్తులు పెట్టుకున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమిదే విజయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 'రాయలసీమ, కోనసీమ కావొచ్చు. ఎక్కడ చూసినా ఒకటే స్పందన. గెలుపు మనదేనన్న ధీమా కళ్ల ముందు కనిపిస్తోంది. నూటికి నూరు శాతం అధికారంలోకి వస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం' అని జోష్యం చెప్పారు.
'ఆకలితో ఉన్న సింహం వేట కోసం ఎదురుచూసినట్టు ఏపీ ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. రెండు బటన్లు నొక్కి వైఎస్సార్‌సీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు' అని బాబు తెలిపారు. జగన్ ఇచ్చిన మద్య నిషేధం హామీపై చంద్రబాబు నిలదీశారు. 'మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పి సీఎం జగన్ మరి అమలు చేశాడా?' అని ప్రశ్నించారు. తన ఆదాయం కోసం.. ఖజానా నింపుకోవడం కోసం కల్తీ మద్యంతో జగన్ ఆడుకున్నాడు' అని తీవ్ర విమర్శించారు. కల్తీ మద్యంతో వేలాది మంది ప్రాణాలు తీసిన జగన్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook