Prasanna Kumar Reddy: ఒకే వేదికపై వైసీపీ నేతల పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు..ఏంటా కథా..!

Prasanna Kumar Reddy: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ తరపు మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు. 

Written by - Alla Swamy | Last Updated : Jun 13, 2022, 07:26 PM IST
  • ఆత్మకూరులో జోరుగా ఉప ఎన్నిక ప్రచారం
  • స్పీడ్‌ పెంచిన వైసీపీ
  • ప్రచారంలో అనుకోని ఘటన
Prasanna Kumar Reddy: ఒకే వేదికపై వైసీపీ నేతల పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు..ఏంటా కథా..!

Prasanna Kumar Reddy: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ తరపు మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నికలో వైసీపీ, బీజేపీ పోటీలో ఉండగా..టీడీపీ దూరంగా ఉంది. ఈక్రమంలో సంగం మండలం జంగాల కండ్రికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

ఉప ఎన్నిక ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బైపోల్‌ ప్రచారంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. అక్కడితో ఆగకుండా అభినందనలు సైతం తెలిపారు. పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ..చంద్రబాబే టార్గెట్‌గా విమర్శలు సంధించారు. ఒకే వేదికపై అధికార పార్టీ నేతలు భిన్నంగా స్పందించడం హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఓ ఎమ్మెల్యే తన పదవీకాలం మధ్యలో మృతి చెంది..ఉప ఎన్నికల్లో ఆ కుటుంబసభ్యులు పోటీ చేస్తే.. ఆ స్థానంలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయం తీసుకుందన్నారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. గౌతమ్‌రెడ్డి మృతి చెందిన సమయంలో బీజేపీ నేతలు సానుభూతి తెలిపి..పోటీ చేయడం ఏంటని ప్రశ్నించారు.  

ఆ తర్వాత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయకపోయినా..వైసీపీకి వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని ఆరోపించారు. బాబు రాజకీయ జీవితమంతా డ్రామాలేనన్నారు. సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయని స్పష్టం చేశారు. ఒకే వేదికపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వేర్వేరు వ్యాఖ్యలు చేయడంపై వైసీపీలోనే జోరుగా చర్చ సాగుతోంది.

Also read:Chandrababu letter to Jagan: ఉద్యోగమో రామ చంద్రా..సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖాస్త్రం..!

Also read:CM Jagan review on Health: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చండి..వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News