ఈవీఎంల అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీపై విమర్శలు సంధిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ అధినేత జగన్ ఎదురు దాడి ప్రారంభించారు. ఈ రోజు గవర్నర్ నరిసంహన్ కు కలిసిన జగన్ ... రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైపీసీ కార్యకర్తలపై చంద్రబాబు దాడులు నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రధానంగా గుంటూరు జిల్లాలోని గురజాల, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో ఎన్నికల రోజున జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ పోలీసులు కూడా అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
చంద్రబాబు ఆదేశాల మేరకే తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఈ మేరకు నరసింహన్ కు వినతిపత్రాన్ని సమర్పించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎదురు దాడి: చంద్రబాబుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ చీఫ్ జగన్ !