Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి గాలులు జోరందుకున్నాయి. రుతు పవనాల ధాటికి ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, యానాం పరిసరాల్లో నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో రాగల మూడు రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని..వీటితోపాటు ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది.
కోస్తాంధ్రలోని ఒకటి రెండు చోట్ల మూడురోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాలు బలపడ్డాయి. కింది స్థాయి నుంచి తెలంగాణ వైపు నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు తెలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
Intense spell of rainfall very likely to continue along west coast during next 5 days.
Subdued rainfall activity over Northwest & adjoining Central India till 25th June, 2022. pic.twitter.com/0tKmRJNGYC
— India Meteorological Department (@Indiametdept) June 23, 2022
Also read:Maharashtra Political Crisis: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందా..సంజయ్ రౌత్ వాదన ఏంటి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook