AP Volunteers: దేశానికి ఆదర్శంగా నిలిచిన ఏపీ వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా ప్రజా సేవకు దూరమైనట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షాల గగ్గోలుతో వలంటీర్ల వ్యవస్థ ఎన్నికలు ముగిసేవరకు నేరుగా ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందించవు. అంటే ఇన్నాళ్లు కొనసాగిన ఇంటింటికి పంపిణీ కార్యక్రమం నిలిపివేశారు. ప్రజలు ఇకపై వార్డు, గ్రామ సచివాలయాలకు వెళ్లి పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కీలక ప్రకటన జారీ చేసింది.
Also Read: Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్ సిద్ధార్థ్ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక
ఎన్నికల నియమావళి ముగిసే వరకు ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండదని సెర్ప్ ప్రకటించింది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లోనే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రకటన కారణంగా వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పై ఆదేశాలు జార అయ్యాయి. లబ్ధిదారులంతా ఇకపై ఆధార్/ ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లి పింఛన్లు పొందాలని సెర్ప్ సూచనలు చేసింది.
Also Read: Bus Yatra: చంద్రబాబు జిత్తులమారి.. పొత్తులమారి: బస్సు యాత్రలో జగన్ ధ్వజం
ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్లతోపాటు అన్ని నగదు పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయం కావడంతో వలంటీర్ల ద్వారా అధికార వైఎస్సార్‌సీపీ ప్రచారం చేయిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ, జనసేనలు ప్రధానంగా ఇదే వాదిస్తున్నాయి. వలంటీర్ల సేవలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. వారి ఫిర్యాదుకు స్పందించిన ఈసీ ఇకపై ప్రభుత్వ పథకాల విషయంలో వలంటీర్ల సేవలు దూరం చేసింది. ఎన్నికలు ముగిసే వరకు వలంటీర్ల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు (ఫోన్లు, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్ తదితర) జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఈసీ ఆదేశించింది. వలంటీర్లు లేకపోవడంతో ఇకపై ప్రభుత్వ సేవలు ప్రభుత్వ సాధారణ ఉద్యోగుల ద్వారా అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook