Union Budget 2023-24: కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు ఇవే..!

union budget 2023: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ఇవాళ ప్రవేశపెట్టారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు ఎంత మేర నిధులు కేటాయించారో తెలుసుకుందాం.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2023, 04:37 PM IST
Union Budget 2023-24: కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు ఇవే..!

Union Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ (Budget 2023)ను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణల్లోని పలు సంస్థలకు భారీగా నిధులు కేటాయించారు. కేంద్ర పన్నుల వాటాలో ఆంధ్రప్రదేశ్ కు రూ. 41, 338 కోట్లు, తెలంగాణకు రూ. 21,470 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏ సంస్థలకు కేటాయింపులు జరిపారో ఓసారి తెలుసుకుందాం. 

తెలంగాణ వైపు..
* సింగరేణి - రూ.1,650 కోట్లు
* మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు - రూ. 1,473 కోట్లు
* ఐఐటీ హైదరాబాద్‌ - 300 కోట్లు

ఏపీ వైపు..
* విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ - రూ. 683 కోట్లు
* ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీ - రూ. 47 కోట్లు
* పెట్రోలియం యూనివర్సిటీ - రూ. 168 కోట్లు

ఉమ్మడిగా..
* మంగళగిరి, బీబీనగర్‌ సహా దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆసుపత్రులకు -  రూ. 6,835 కోట్లు
* రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలు - రూ. 37 కోట్లు
* సాలార్జంగ్‌ సహా అన్ని మ్యూజియాలకు - రూ. 357 కోట్లు

Also Read: Union Budget 2023 Live udpates: రైల్వే, వేతన జీవులు, వ్యవసాయ రంగాలకు వరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News