రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు మృతి

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద జాతీయ రహదారిపై సునీల్ ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వాహనం ఢీ కొంది.

Last Updated : Jun 26, 2018, 09:46 AM IST
రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు మృతి

టీవీ నటుడు నన్నం సునీల్‌(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద జాతీయ రహదారిపై సునీల్ ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో సునీల్‌తో పాటు ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లికి చెందిన సునీల్‌ కొన్నేళ్లుగా కోవూరు మండలం పడుగుపాడు గ్రామానికి చెందిన సినీ సంగీత దర్శకుడు షకీల్‌ వద్ద శిక్షణ పొందుతూ.. టీవీ సీరియళ్లు, సినిమాల్లో నటిస్తున్నాడు. సునీల్‌ హైదరాబాద్ నుండి స్వగ్రామానికి వస్తుండగా.. రాచర్లపాడు వద్ద గుర్తు తెలియని వాహనం కారును ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో సునీల్‌ అక్కడికక్కడే మృతిచెందగా కారులోని మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Trending News