అమ్మకానికి శ్రీవారి ఆస్తులు..!!

కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆస్తులు వేలానికి వచ్చేశాయి. 23  స్థిరాస్తులను వేలం వేసి విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం..TTD నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రక్రియను కూడా ప్రారంభించింది. 

Last Updated : May 24, 2020, 11:44 AM IST
అమ్మకానికి శ్రీవారి ఆస్తులు..!!

కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆస్తులు వేలానికి వచ్చేశాయి. 23  స్థిరాస్తులను వేలం వేసి విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం..TTD నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రక్రియను కూడా ప్రారంభించింది. 

తిరుమలలో కొలువై ఉన్న కలియుగ బ్రహ్మండ కోటి నాయకుడు తిరుమల శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ భక్తులు తమ ఇష్టదైవానికి సమర్పించినవే. ఐతే ఇప్పుడు ఈ ఆస్తుల్లో కొన్నింటిని వేలం వేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. తమిళనాడులోని 23 స్థిరాస్తులను వేలం ద్వారా విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం టీటీడీ బోర్డు రెండు కమిటీలు వేసింది. ఈ ఆస్తుల ద్వారా తిరుమల ఆలయానికి ఒరిగేదేం లేదని.. పైగా వాటి నిర్వహణ భారంగా మారిందని టీటీడీ బోర్డు వాదిస్తోంది. అందుకోసమే వేలం వేసి విక్రయించాలని తీర్మానించినట్లు పేర్కొంది. 

తమిళనాడులోని పలు  జిల్లాల్లో ఉన్న ఈ ఆస్తుల్లో వ్యవసాయ స్థలాలు, ఇళ్లతోపాటు, ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి. ఐతే ఇందులో చాలా వరకు ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉన్నందున వేలం వేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆస్తుల వేలం ప్రక్రియ అంతా చట్టప్రకారమే జరుగుతోందని చెప్పారు.  అక్రమంగా ఆస్తులు వేలం వేస్తున్నారన్న సోషల్ మీడియా వార్తలను భక్తులు  పట్టించుకోవద్దని కోరారు. 


 మరోవైపు టీటీడీ ఆస్తుల వేలం ప్రక్రియను భారతీయ జనతా పార్టీ ఖండించింది. టీటీడీ ఈ  ఆలోచనను విరమించుకోవాలని కోరింది.  కావాలంటే ఆయా నిరర్ధక ఆస్తులను ధార్మిక ప్రయోజనాల కోసం వాడుకోవాలని సూచించింది. టీటీడీ తీసుకున్న ఈ అనాలోచిత  చర్య  కారణంగా వేలాది మంది భక్తుల  మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొంది. అంతే కాకుండా ముఖ్యంగా దాతల సెంటిమెంట్ దెబ్బతింటుందని తెలిపింది. టీటీడీ ఇదే విధంగా ముందుకు వెళ్తే ప్రజల నుంచి  తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. 

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దాదాపు 2 నెలల నుంచి  తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. దీంతో తిరుమల ఆలయానికి ఆదాయం చాలా మేరకు తగ్గిపోయింది. దీంతో టీటీడీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందనే వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు ఆస్తులను వేలం వేసి.. ఆ ఆదాయాన్ని కార్పస్ ఫండ్ కు జమ చేయాలని నిర్ణయించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News