Tirumala Darshan Tickets: తిరుమలలోని శ్రీవారి భక్తులకు శుభవార్త. రేపటి నుంచి అనగా ఫిబ్రవరి 15 (మంగళవారం) నుంచి సర్వ దర్శనం టోకెన్స్ తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేయనుంది. కరోనా సంక్షోభం కారణంగా గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ లో సర్వదర్శనం టికెట్లను జారీ చేశారు. ఇప్పుడు దేశంతో పాటు రాష్ట్రంలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల మరోసారి గతంలో మాదిరిగా టోకెన్లు భక్తులకు ఇవ్వనున్నారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 9 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజ స్వామి సత్రాల్లో టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉన్న కారణంగా మార్చి 1వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు కూడా అనుమతించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు టీటీడీ సర్వదర్శనం టికెట్లకు సంబంధించిన నకిలీ టికెట్లను విక్రయిస్తున్న ఫేక్ వెబ్ సైట్స్ నుంచి జాగ్రత్త వహించాలని టీటీడీ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
అయితే వాటికి సంబంధించిన కొన్ని ఫేక్ వెబ్ సైట్స్ ను ఎప్పటికప్పుడూ శాశ్వతంగా తొలగిస్తున్నట్లు వారు వెల్లడించారు. శ్రీవారి సర్వ దర్శనం టికెట్లను బుక్ చేసుకునే వారు టీటీడీ అఫీషియల్ వైబ్ సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు.
Also Read: AP New Districts: కొత్త జిల్లాల అభ్యంతరాలపై స్పందించిన ప్రభుత్వం, కమిటీ ఏర్పాటు
ALso Read: AP New Districts: ఏపీలో మార్చి 18 నాటికి కొత్త జిల్లాలు... ఏప్రిల్ 2 నుంచి కార్యకలాపాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook