Times Now Survey: మళ్లీ ఫ్యాన్‌దే హవా, ప్రభావం చూపని బాబు అరెస్ట్, జనసేన పొత్తు

Times Now Survey: ఏపీలో ఎన్నికలపై మరో జాతీయ మీడియా సంస్థ సర్వే నిర్వహించింది. ఏపీలో ఇటీవల జరిగిన పరిణామాల అనంతరం జరిపిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలుస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 3, 2023, 09:22 AM IST
Times Now Survey: మళ్లీ ఫ్యాన్‌దే హవా, ప్రభావం చూపని బాబు అరెస్ట్, జనసేన పొత్తు

Times Now Survey: ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, కొత్త సమీకరణాల నేపధ్యంలో మరోసారి ఆ జాతీయ సంస్థ సర్వే చేపట్టింది. చంద్రబాబు అరెస్టు, జనసేన-టీడీపీ పొత్తు పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సర్వే కొనసాగినట్టు తెలుస్తోంది. అందుకే ఈ సర్వే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. 

ఏపీ ఇటీవలి కాలంలో చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయ్యారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఈ క్రమంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ మరోసారి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందనే అంశంపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. మరోసారి ఏపీలో ఫ్యాన్ ప్రభంజనం ఉంటుందని స్పష్టమైంది. 

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 51.10 శాతం ఓట్లు సాధించి 24-25 ఎంపీ సీట్లు సాధిస్తుందని టైమ్స్ నౌ అంచనా వేసింది. తెలుగుదేశం ప్రభుత్వం 36.4 శాతం ఓట్లతో ఒక ఎంపీ స్థానాన్ని గెల్చుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జనసేనకు 10.1 శాతం ఓట్లు సాధించి మరోసారి చతికిలపడుతుందని తేలింది. ఇక బీజేపీకు 1.30 శాతం, ఇతరులకు 1.10 శాతం ఓట్లు రావచ్చు. 

చంద్రబాబు అరెస్ట్ అయ్యారనే సానుభూతి గానీ జనసేన-టీడీపీ పొత్తుగానీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించలేదని టైమ్స్ నౌ అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 22 ఎంపీ స్థానాల్ని గెల్చుకోగా టీడీపీ 3 స్థానాలు దక్కించుకుంది. ఈసారి ఏకంగా 24-25 స్థానాలు గెల్చుకోవచ్చని తెలుస్తోంది. గత 52 నెలలుగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాబివృద్ధి పథకాలు, సుపరిపాలనతో వైసీపీకు ఆదరణ మరింతగా పెరిగిందని టైమ్స్ నౌ విశ్లేషించింది. 

చంద్రబాబు అరెస్ట్ సానుభూతి గానీ, జనసేన-టీడీపీ పొత్తు గానీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించలేదని టైమ్స్ నౌ తెలిపింది. ప్రజల్లో ఈ అంశాలకు అంతగా ప్రాధాన్యత కన్పించలేదని సర్వే విశ్లేషిస్తోంది.

Also read: Supreme Court: చంద్రబాబు క్వాష్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ, సర్వత్రా ఆసక్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News