తమకు 125 సీట్లకు తగ్గకుండా వస్తాయని వైపీపీ పైకి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓట్ల చీలిక అంశం ఆ పార్టీకి లోలోపల కలవరపెడుతోందట. పవన్ కల్యాణ్ పార్టీ , ప్రజాశాంతి పార్టీల రూపంలో ఎంత నష్టం జరుగుతుందనేది వైసీపీ శ్రేణులు అంచానాకు రాలేకపోతున్నారట...
పవన్ పవర్ ఎంత ?
జనసేన పార్టీ పోటీలో లేకుంటే యువకుల ఓట్లు గుంపగుత్తగా తమకే పడతాయని వైసీపీ అంచనా వేసింది. తీరా ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దిగి యూత్ ఓట్లు కొల్లగొట్టడం జరిగిందని రాజకీయ విశ్లేషకలు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కాపు ఓట్లు దండిగా పడతాయని భావించిన వైసీపీకి ఆశించిన ఫలితం రాలేదని టాక్ ..పవన్ కాపు ఓట్లు చీల్చి నష్టం కల్గించారని వాదన గట్టిగా వినిప్తోంది. ఈ కోణంలో ఆలోచించి జనసేన పార్టీ కల్గించిన నష్టంపై వైసీపీ కరవరపడుతోందని టాక్.
ప్రజా శాంతి ప్రభావమెంతా ?
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధులను ఎవరూ ప్రధాన ప్రత్యర్ధిగా భావించలేదు..ఓట్ల చీలిక విషయంలోనూ ఎవరూ అంతగా అంచనా వేయలేదు. అయితే టీడీపీ తో లాస్ట్ మినట్ వరకు వైసీపీ హోరా హోరీగా పోరాడింది. దీంతో గెలుపు ఓటములకు స్వల్ప తేడా ఉండే అవకాశముందని రాజకీయవర్గాల్లో విశ్లేషణ జరగుతున్నాయి. జగన్ కు అండగా ఉంటరని లెక్కలు వేససుకున్న దళిత క్రిస్టియన్ ఓట్లు కేఏ పాల్ కనీసం ఒక్క శాతం ఓట్లైన చీల్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ కోణంలో ఆలోచించి ప్రజా శాంతి పార్టీ విషయంలో వైసీపీలో టెన్షన్ పెరుగుతోందట.
2014 ఎన్నికల్లోనూ వైసీసీ విజయంపై గట్టి ధీమాను ప్రదర్శించింది. అయితే ఆ ఎన్నికల్లో 22 స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమి చవి చూడటం వల్ల వైసీపీ అధికారం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఓట్ల చీలిక ఈ అంశం ఏవైన తమకు ప్రతికూలంగా మారితే పరిస్తితి ఏంటని వైపీసీ శ్రేణులు కలవరపడుతున్నారని టాక్.