Lokesh Padayatra: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ ఇతర పరిణామాల నేపధ్యంలో అతని తనయుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దాదాపు 3 నెలల క్రితం అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇవాళ తిరిగి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుంది.
టీడీపీ నేత నారా లోకేష్ ఇవాళ ఉదయం 10 గంటల 19 నిమిషాలకు కోనసీమ జిల్లా రాజోలు నియోదజకవర్గం పొదలాడలో గతంలో ఎక్కడైతే పాదయాత్ర నిలిపివేశారో అక్కడ్నించి తిరిగి ప్రారంబించనున్నారు. జనవరి 27న కుప్పంలో యాత్ర ప్రారంభించిన లోకేశ్..208 రోజులపాటు 2,852.4 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు. ఇప్పటి వరకూ 9 ఉమ్మడి జిల్లాల్లో 84 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగింది. చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో సెప్టెంబర్ 9వ తేదీన పాదయాత్ర నిలిపివేశారు. తిరిగి 79 రోజుల తరువాత ఇవాళ ప్రారంభిస్తున్నారు.
వాస్తవానికి కుప్పంలో ప్రారంభించిన పాదయాత్రను ఇఛ్చాపురం వరకూ 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలన్నది లక్ష్యం. ఆ తరువాత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్, బెయిల్ ప్రక్రియ వ్యవహారాల కోసం ఢిల్లీలో న్యాయవాదులతో ఉండాల్సి రావడంతో లోకేశ్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. రెండున్నర నెలల బ్రేక్ పడింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాదయాత్రను ఇఛ్ఛాపురం వరకూ కాకుండా విశాఖపట్నానికి కుదించాల్సిన వస్తోంది. గతంలో చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర కూడా విశాఖపట్నంతోనే ముగిసింది. ఇవాళ ప్రారంభం కానున్న పాదయాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనుంది. రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ టౌన్, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి జిల్లాలో ప్రవేశిస్తుంది. అక్కడ్నించి అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నంలో పాదయాత్ర ముగించనున్నారు.
Also read: Organ Donation: తాను మరణిస్తూ మరో ఐదుగురు జీవితాల్లో వెలుగులు.. విషాద సమయంలో గొప్ప నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook