Kesineni Nani: భూమాఫియా చేతుల్లో చంద్రబాబు, అమరావతి మతలబు ఇదే

Kesineni Nani: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న  విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశ అధినేత చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి వెనుక మతలబు ఏంటనేది వివరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 12, 2024, 07:01 PM IST
Kesineni Nani: భూమాఫియా చేతుల్లో చంద్రబాబు, అమరావతి మతలబు ఇదే

Kesineni Nani: చంద్రబాబుతో విబేధాల నేపధ్యంలో ఆపార్టీ విజయవాడ ఎంపీ ఇటీవల పార్టీకు, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీలో చేరిన వెంటనే ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన-తెలుగుదేశం పొత్తు గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన కుమారుడు లోకేశ్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని కేశినేని ఆరోపించారు. ఇందులో భాగంగా భాగస్వామ్య పార్టీని సైతం మోసగించేందుకు వెనుకాడరని, కాపు సామాజిక వర్గం ఆశల్ని నిరాశపరుస్తాడని కేశినేని నాని స్పష్టం చేశారు. ఒకవేళ అధికారంలో వచ్చినా..పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కనివ్వరని చెప్పారు. 

మరోవైపు అమరావతి ముసుగులో చంద్రబాబు మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అమరావతిని అభివృద్ధి చేస్తానని భ్రమల్లో ఉంచి విజయవాడను స్మశానంలా మార్చాడని కేశినేని నాని ధ్వజమెత్తారు. విజయవాడను ఎలా నాశనం చేయాలనేదే చంద్రబాబు ఆలోచనగా ఉంటుందన్నారు. వారధి నుంచి కాజా వరకూ ఉన్న స్థలంలో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేసి ఉండొచ్చన్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి గుంటూరు వరకూ మొత్తం ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చెంది ఉండేదన్నారు. కానీ ల్యాండ్ మాఫియాకు పాల్పడి రైతుల్ని మోసం చేసి 33 వేల ఎకరాలు సేకరించాడన్నారు. అమరావతి రాజధాని అనేది మరో 30 ఏళ్లయినా పూర్తికాదని తాను ఏనాడో కొనకళ్ల నారాయణతో చెప్పానన్నారు. భూమాఫియా చేతుల్లో చంద్రబాబు వెళ్లిపోయాడన్నారు. సులభంగా చెప్పాలంటే హైదరాబాద్ పాతబస్తీలా విజయవాడను తయారు చేయాలనేది చంద్రబాబు ఉద్దేశ్యమన్నారు. 

Also read: Vangaveeti Radha: వంగవీటి రాధా వైసీపీలో చేరడం ఖాయమేనా, పోటీ ఎక్కడ్నించి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News