హైదరాబాద్: ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులు టాప్ ర్యాంక్స్ సొంతం చేసుకుని తమ సత్తా చాటుకున్నారు. మంగళవారం విడుదల చేసిన ఏపీ ఎంసెట్-2019 ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో టాప్-10 ర్యాంకుల్లో 6 ర్యాంకులు, మెడికల్, అగ్రికల్చర్ విభాగంలో టాప్-10 ర్యాంకుల్లో మూడు ర్యాంకులను తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో పరీక్షకు హాజరైన వారిలో 1,38,160 (హాజరైన వారిలో 74.39%) మంది కోర్సుకు అర్హత సాధించగా, వారిలో 1,22,188 మందికే ర్యాంకులు ప్రకటించారు. అర్హత సాధించిన వారిలో 82,088 మంది బాలురు, 56,072 మంది బాలికలు ఉన్నారు.
ఇక అగ్రికల్చర్-మెడికల్ విభాగంలో మొత్తం 68,512 ( హాజరైన వారిలో 83.64%) మంది అర్హత సాధించగా, వారిలో 63,206 మందికే ర్యాంకులు కేటాయించారు.
ఇంటర్‌లో ఉత్తీర్ణత కాకపోవడం, మార్కులు అందకపోవడం వంటి కారణాలతో మిగతా వారికి ఇంకా ర్యాంకులు కేటాయించలేదని తెలుస్తోంది.
ఇంజనీరింగ్, మెడికల్-అగ్రికల్చర్ కోర్సుల వారీగా ఏపీ ఎంసెట్ లో టాప్ ర్యాంక్స్ సొంతం చేసుకున్న తెలంగాణ విద్యార్థుల వివరాలిలా వున్నాయి.
ఇంజనీరింగ్ కోర్సు:
వేద ప్రణవ్ 2 రంగారెడ్డి
హేద హవ్య 4 రంగారెడ్డి
బి. కార్తికేయ 5 రంగారెడ్డి
అభిజిత్ రెడ్డి 8 రంగారెడ్డి
ఎల్.ఆర్యన్ 9 రంగారెడ్డి
హేమ వెంకట్ అభినవ్ 10 కొత్తగూడెం
మెడిసిన్-అగ్రికల్చర్ కోర్సులు
టి. హాసిత 4 హైదరాబాద్
జి. మాధురి రెడ్డి 5 రంగారెడ్డి
ఎ. కుశ్వంత్ 10 భూపాలపల్లి