అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల (AP Local Bodies Elections) ఎన్నికల నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కాగా తెలుగుదేశం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీకి చెందిన కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నామినేషన్ పత్రాలను వైసీపీ నేతలు చించేస్తారన్న భయంతో, వాటిని తన పైట చాటున దాచుకుని వెళ్తుండగా వైసీపీ నేతలు అడ్డుపడి పత్రాలు లాక్కునే క్రమంలో ఆమెను అభ్యంతరకరంగా తాకారని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై పార్లమెంట్ స్పీకర్‌కు ఫిర్యాదు
వైయస్‌ఆర్‌సీపీ నాయకులకు దళిత, గిరిజన మహిళలంటే గౌరవం లేదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. కాగా రానున్న మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైస్సార్సీపీకి ప్రజలే బుద్ది చెప్పనున్నారని అన్నారు. సామాజిక న్యాయమని మాట్లాడే సీఎం జగన్మోహన్ రెడ్డి దళిత గిరిజన మహిళలపై జరిగిన దాడులను ఏ విదంగా చూస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఒక ఎస్టీ మహిళకు ఎన్నికల్లో పోటీ చేసే స్వాతంత్య్రం లేనప్పుడు ఇంకెక్కడి సామాజిక న్యాయం? ఇంకెక్కడి ప్రజాస్వామ్యం? అని ప్రశ్నిచారు. కాగా 151 సీట్లు గెలిచామని గొప్పలు చెప్పుకునే వైస్సార్సీపీ, అమరావతిలో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు.
Read Also: ట్రావెల్స్ బస్సు దగ్ధం.. భయాందోళనకు గురైన ప్రయాణికులు
గత రాత్రి మాచర్ల దాడి ఘటనలో గాయపడిన న్యాయవాది కిశోర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించి దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..