అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ పాలన తిరోగమనం దిశలో సాగుతోందని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ విమర్శించింది. రివర్స్ టెండర్ల పేరుతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనను నిరసిస్తూ అమరావతి సచివాలయం నుంచి వెనక్కి నడుస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. టెండర్లన్నీ వైసీపీ నేతలు రిజర్వ్ చేసుకుని రివర్స్ టెండరింగ్ అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
#WATCH Amaravati: TDP chief N Chandrababu Naidu along with other party workers stages a protest by walking backwards, against the state government alleging that govt is pushing the development works in the state backwards. #AndhraPradesh pic.twitter.com/wZoBkFMMGm
— ANI (@ANI) December 16, 2019
ఈ సందర్భంగా ఏపీ సర్కార్ వైఖరిపై తీవ్రంగా విరుచుకుపడిన చంద్రబాబు.. వైసీపీ తిరోగమనం పాలన కారణంగా 2 లక్షల కోట్ల విలువైన కేపిటల్ అమరావతి నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. విదేశీ పెట్టుబడులు రావడం లేదని విమర్శించారు. అంతే కాకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు కూడా వెనక్కి వెళ్లిపోతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తచేశారు.