TDP MAHANADU: మహానాడులో ప్రధాని మోడీపై చంద్రబాబు హాట్ కామెంట్స్...

TDP MAHANADU: తెలుగుదేశం పార్టీ మహానాడు ఒంగోలులో ఉత్సాహంగా సాగుతోంది. మండువవారిపాలెంలో జరుగుతున్న టీడీపీ పండుగకు అన్ని జిల్లాల నుంచి ఆ పార్టీ నేతలు భారీగా తరలివచ్చారు.మహానాడులో ప్రారంభ ఉపన్యాసం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపైనా హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 27, 2022, 02:33 PM IST
  • మహానాడులో ప్రధాని మోడీని పేరు ప్రస్తావన
  • ఐఎస్భీ వేడుకలో ప్రధాని నా పేరు చెప్పలేదు- బాబు
  • నా కృషిని ఎవరూ మర్చిపోలేరు- చంద్రబాబు
TDP MAHANADU: మహానాడులో ప్రధాని మోడీపై చంద్రబాబు హాట్ కామెంట్స్...

TDP MAHANADU:  తెలుగుదేశం పార్టీ మహానాడు ఒంగోలులో ఉత్సాహంగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తి చేసుకోవడం.. ఎన్టీఆర్ శతి జయంతి ఉత్సవాలు మొదలుకానుండటంతో ఈసారి మహానాడును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒంగోలు మండువవారిపాలెంలో జరుగుతున్న టీడీపీ పండుగకు అన్ని జిల్లాల నుంచి ఆ పార్టీ నేతలు భారీగా తరలివచ్చారు. మహానాడులో ప్రారంభ ఉపన్యాసం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపైనా హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు.

తన ముందుచూపు వల్లే హైదరాబాద్ ఇప్పుడు ఐటీలో టాప్ ప్లేస్ ఉందని చెప్పారు చంద్రబాబు. ప్రధాని మోడీ గురువారం గచ్చిబౌలిలోని ఐఎస్ బీకి వచ్చారు. వార్షికోత్సవంలో పాల్గొన్నారు. గచ్చిబౌలిలో ఐఎస్బీని చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2001లో ఏర్పాటైంది. ఆసియాలోనే టాప్ బిజెనెస్ స్కూళ్లలో ఒకటైన ఐఎస్బీ.. నాటి ప్రధాని అటల్ బిహార్ వాజ్ పేయి చేతుల మీదుగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ ఐఎస్బీ వార్షికోత్సవంలో చేసిన ప్రసంగంలో ఆనాటి సంగతులు చెప్పారు. ప్రధాని అటల్ చేతుల మీదుగా ప్రారంభమైందని గుర్తు చేశారు. కాని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు మాత్రం చెప్పలేదు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రధాని మోడీ.. చంద్రబాబును గుర్తు  చేయాల్సి ఉండేదని టీడీపీ ఫాలోవర్స్ పోస్టులు పెడుతున్నారు. తాజాగా చంద్రబాబు కూడా  ఈ విషయంపై స్పందించారు.

మహానాడులో ఐఎస్బీ గురించి మాట్లాడారు చంద్రబాబు. అనాడు తాను చేసిన కృషిని చెప్పుకున్నారు. ఈ స్కూల్స్ కోసం ఇతర నగరాలు పోటీ పడినా.. నిర్వాహుకులను తాను ఒప్పించి హైదరాబాద్ లో ఏర్పాటు చేయించానని తెలిపారు. ఐఎస్భీ కోసం తాను నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. 2001లో ఏం జరిగిందో వివరించారు. ఎన్నో అడ్డంకులు అధిగమించి ఐఎస్ బీని ఏర్పాటు చేసుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగానే ప్రధాని మోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. గురువారం జరిగిన ఎస్బీ వార్షికోత్సవ వేడుకలో ప్రధానమంత్రి నా పేరు ప్రస్తావించకపోవచ్చు.. కాని నా కృషిని ఎవరూ మర్చిపోలేరని చంద్రబాబు కామెంట్ చేశారు. పరోక్షంగా ప్రధాని మోడీ తీరును చంద్రబాబు తప్పుపట్టారు. ఎవరూ అవునన్నా కాదన్నా హైదరాబాద్ అభివృద్దిలో తమ ముద్రను చెరిపివేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను హైదరాబాద్ కు ఏం చేసిందో తెలుగు ప్రజలు తెలుసన్నారు చంద్రబాబు.

READ ALSO: TRS COUNTER: పకోడీలు అమ్ముకోవాలన్న మోడీకి ఐటీ ఏం తెలుసు!

READ ALSO: TDP MAHANADU: ఉన్మాది చేతిలో పోలీసులు బలి కావొద్దు.. మహానాడు ప్రసంగంలో చంద్రబాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News