Chandrababu Comments: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వార్ వన్ సైడే.. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఎప్పుడు చూడలేదన్న చంద్రబాబు

Chandrababu Comments: మహానాడు సక్సెస్ తో జోష్ మీదున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరింత దూకుడు పెంచారు. పార్టీ నేతలంతా జనంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల టూర్లు, పార్టీ కమిటీల నియామకం వంటి అంశాలపై  పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Written by - Srisailam | Last Updated : May 31, 2022, 05:24 PM IST
  • పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వార్ వన్ సైడే- బాబు
  • పార్టీలో గ్రూపులు కడితే సహించను- బాబు
Chandrababu Comments: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వార్ వన్ సైడే.. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఎప్పుడు చూడలేదన్న చంద్రబాబు

Chandrababu Comments: మహానాడు సక్సెస్ తో జోష్ మీదున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరింత దూకుడు పెంచారు. పార్టీ నేతలంతా జనంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల టూర్లు, పార్టీ కమిటీల నియామకం వంటి అంశాలపై  పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అసమర్థ, అధ్వాన్న పాలనతో వైసిపి పని అయిపోయిందని చంద్రబాబు అన్నారు. ప్రజలు పాలనపై తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉన్నారని.. ఇంతటి ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా  వార్ వన్ సైడే ఉంటుందని తేల్చిచెప్పారు చంద్రబాబు.

మహానాడు సక్సెస్ కావడానికి గల కారణాలను పార్టీ నేతలకు వివరించారు చంద్రబాబు .మూడేళ్ల జగన్ నియంత పాలనతో కార్యకర్తల్లో కసి ఉందని.. అది మహానాడులో స్పష్టంగా కనిపించిందని చెప్పారు. వాహనాలు దొరక్కుండా ఇబ్బందులు పెట్టినా వందల కిలోమీటర్ల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి సభను జయప్రదం చేశారని అన్నారు. సొంతగా ఆటోలు, ట్రాక్టర్లు, లారీల్లో జనం రావడం రాష్ట్రంలో రాజకీయంగా వచ్చిన మార్పుకు నిదర్శనమన్నారు చంద్రబాబు. వైసిపి మంత్రుల బస్సు యాత్ర జనం లేక వెలవెల పోతే.. మహానాడు దగ్గర కంట్రోల్ చేయలేని స్థాయిలో జనం వచ్చారని తెలిపారు.బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగించాలి పార్టీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. సభ్యత్వ నమోదును వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

పార్టీ కమిటీల నియామకంపైనా నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. గ్రామ స్థాయి వరకు పెండింగ్ లో ఉన్న అన్ని కమిటీల నియామకం పూర్తి చేయాలని చెప్పారు. పార్టీ నేతలు క్రమశిక్షణగా ఉండాలని హెచ్చరించారు. పార్టీలో  ఏ స్థాయిలోను గ్రూపులను సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రూపులు కట్టే వారి విషయంలో కఠినంగా ఉంటానని...ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవని తేల్చి చెప్పారు. ఓట్ల తొలగింపు విషయంలో గ్రామ స్థాయిలో నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యకర్తలు ఒంటరి వారు కాదన్న చంద్రబాబు.. ఎవరికి  కష్టం వచ్చినా పార్టీ చూసుకుంటుందని వివరించారు.  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు పెంచాలని సూచించారు.

తెలుగు దేశం మహానాడు విజయాన్ని దాన్ని సక్సెస్ చేసిన కార్యకర్తలకు అంకితం ఇస్తున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి, అక్రమాలపై స్థానికంగా పోరాటం చేయాలని సూచించారు. స్థానిక సమస్యలు, అధికార పార్టీ పెద్దల వైఫల్యాలను స్థానికంగానే ఎండగట్టాలని అచ్చెన్నాయుడు చెప్పారు.

READ ALSO:Tirupati Railway Station: ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా తిరుపతి, డిజైన్ విడుదల

READ ALSO: Atmakur Bypoll: ఆత్మకూరు బైపోల్ కు టీడీపీ దూరం.. బీజేపీ కోసమేనా.. పొత్తుకు ముందస్తు వ్యూహమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News