Srisailam Temple News: శ్రీశైలంలో అర్ధరాత్రి కన్నడ భక్తుల వీరంగం.. దుకాణాలు, వాహనాలను ధ్వంసం!

Srisailam Temple News: శ్రీశైలంలో అర్ధరాత్రి కర్ణాటక యువకులు వీరంగం సృష్టించారు. స్థానికులతో జరిగిన వాగ్వాదం పెద్దగలాటాను సృష్టించింది. ఇందులో ఓ కన్నడ భక్తుడు గాయపడగా.. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తమ సన్నిహితుడు గాయపడడాన్ని సహించని యువకులు.. శ్రీశైల పురవీధుల్లో విధ్వంసం చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 10:55 AM IST
Srisailam Temple News: శ్రీశైలంలో అర్ధరాత్రి కన్నడ భక్తుల వీరంగం.. దుకాణాలు, వాహనాలను ధ్వంసం!

Srisailam Temple News: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో బుధవారం అర్థరాత్రి తర్వాత ఉద్రిక్తత నెలకొంది. ఆలయానికి దగ్గర్లో ఉన్న వీధుల్లో కొందరు కర్ణాటక యువకులు వీరంగం చేశారు. ఓ టీ దుకాణం వద్ద స్థానికులకు, కర్ణాటకకు చెందిన యువకులకు మధ్య జరిగిన గొడవ.. కొట్లాటకు దారితీసింది. ఈ క్రమంలో ఆ యువకులు టీ దుకాణానికి నిప్పు పెట్టారు. 

దీంతో ఇరువర్గాలు బాహాబాహీ తలపడ్డారు. దాడిలో ఓ కన్నడ భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో వెంటనే సున్నిపెంటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

దీంతో తమ సన్నిహితుడిడి జరిగిన దాడికి ప్రతికారంగా కన్నడ యువకులు గుంపు.. శ్రీశైల పురవీధుల్లోకి చేరి దుకాణాలు, కార్లతో పాటు ఇతర వాహనాలపై దాడికి తెగబడ్డారు. దీంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. సమాచారాన్ని తెలుసుకున్న డీఎస్పీ శ్రుతి హుటాహుటిని శ్రీశైలం చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.  

Also Read: Tirumala Darshan: తిరుమలలో శ్రీవారి ప్రత్యేక దర్శనానికి ఇకపై వృద్ధులకు అనుమతి!

Also Read: AP Power Charges Hike: రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు.. యూనిట్ కు ఎంత పెరిగిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News