/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

ఓ పక్క రైలు బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది.. మరోపక్క నిల్చున్న టికెట్‌ కౌంటర్‌ వద్ద పెద్ద క్యూ ..  టికెట్‌ దొరుకుతుందా.. లేదా.. రైలు ఎక్కుతామా? లేదా ఇలా ఒకటే టెన్షన్..! ఇక ఇప్పుడు ఆ బాధ ఉండదులేండీ.. త్వరలో దీనికి ఫులుస్టాప్ పెట్టే ఆలోచనలో ఉంది దక్షిణ మధ్య రైల్వే.  

రిజర్వేషన్‌ లేని సాధారణ (జనరల్‌) టికెట్లను మొబైల్‌ఫోన్‌ నుంచి బుక్ చేసుకొనే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అందించనుంది. మరో ఒకట్రెండు రోజుల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందుకోసం ‘యూటీఎస్‌ ఆన్‌ మొబైల్‌’ పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో భారీ క్యూ లైన్ లో నిలబడే సమస్య తీరనుంది. ఈ యాప్ అందుబాటులోకి వచ్చి కొన్ని రోజులే అయ్యింది. కొన్ని రైల్వేజోన్లు ఈ యాప్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చాయి. మరికొన్ని రైల్వేజోన్లలో కాస్త ఆలస్యం అయ్యింది. అందులో దక్షణ మధ్య రైల్వే కూడా ఒకటి.

కాస్త ఆలస్యంగా దక్షిణ మధ్యరైల్వే కూడా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అయ్యింది. జోన్‌ పరిధిలో అన్ని రైల్వేస్టేషన్లలో యూటీఎస్‌ ఆన్‌ మొబైల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.  ఈ యాప్‌తో ఎక్కడినుంచైనా, ఎన్ని రోజుల ముందైనా జనరల్ టికెట్‌ను పొందవచ్చు. జనరల్‌ టికెట్‌ తీసుకోవాలంటే ముందుగా పేరు, చిరునామా, ఫోన్‌ నెంబరు వంటి వివరాలతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘రైల్వే వాలెట్‌’లో కొంత డబ్బును జమ చేయాల్సి ఉంటుంది. టికెట్‌ తీసుకొనేటప్పుడు ఈ వాలెట్‌ నుంచి డబ్బులు టికెట్‌కు వెళతాయి. ఏదైనా కారణంతో  ప్రయాణం రద్దైతే టికెట్‌నూ రద్దు చేసుకోవచ్చట.

Section: 
English Title: 
South Central Railways Launches Mobile App to Book Unreserved Tickets
News Source: 
Home Title: 

 జనరల్ టికెట్లు బుక్ చేసుకోండిలా ..

ఇక జనరల్ టికెట్లనూ ఫోన్ నుంచి బుక్ చేసుకోవచ్చు
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
జనరల్ టికెట్లనూ ఫోన్ నుంచి బుక్ చేసుకోవచ్చు