Kodali Nani: ఏపీ మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసు ఇచ్చిన AP SEC

AP SEC Issue Show Cause Notices To Kodali Nani: అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం చెందిన ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని, వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 12, 2021, 01:17 PM IST
  • ఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల వివాదాలు
  • ఏపీ ఎలక్షన్ కమిషనర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని
  • రాష్ట్ర మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఏపీ ఎస్ఈసీ
Kodali Nani: ఏపీ మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసు ఇచ్చిన AP SEC

AP SEC Issue Show Cause Notices To Kodali Nani: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ షాక్ ఇచ్చారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ ఎస్ఈసీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, దానిపై  మంత్రి కొడాలి నానికి నోటీసులు జారీ చేసినట్లు అందులో పేర్కొన్నారు.

మీడియా సమావేశంలో ఎస్ఈసీని కించ పరుస్తు చేసిన వ్యాఖ్యలను బహిరంగంగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన చేయాలని నోటీసులలో పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ కమిషన్ ప్రతిష్టను దిగజార్చేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని, తక్షణమై దానిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడును, ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్(Nimmagadda Ramesh Kumar) లను ఆస్పత్రికి తరలించి ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం

నేటి (ఫిబ్రవరి 12) సాయంత్రం 5 గంటలలోపు మంత్రి కొడాలి నాని వ్యక్తిగతంగా గానీ, లేదా తన ప్రతినిధుల ద్వారాగానీ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు బహరింగ ప్రకటన చేయాలని నోటీసులలో సూచించారు. కాగా, ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News