Special Trains in Ap: అక్టోబర్ 1 నుంచి ప్రత్యేక రైళ్లు, ఏపీలో ఇవే ఆ స్టేషన్లు

కోవిడ్ 19 కారణంగా ప్రస్తుతం రైలు ప్రయాణాలకు భారీగా డిమాండ్ ఎదురవుతోంది. ప్రయాణీకుల డిమాండ్ నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఆ రైళ్లు నిలిచే స్టేషన్లను సైతం ప్రకటించింది.

Last Updated : Sep 29, 2020, 06:46 PM IST
Special Trains in Ap: అక్టోబర్ 1 నుంచి ప్రత్యేక రైళ్లు, ఏపీలో ఇవే ఆ స్టేషన్లు

కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) కారణంగా ప్రస్తుతం రైలు ప్రయాణాలకు భారీగా డిమాండ్ ఎదురవుతోంది. ప్రయాణీకుల డిమాండ్ నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే ( South central railway ) ప్రత్యేక రైళ్లు ( Special Trains ) నడపనుంది. ఆ రైళ్లు నిలిచే స్టేషన్లను సైతం ప్రకటించింది.

కరోనా వైరస్ కారణంగా రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అన్ లాక్ ప్రక్రియ ( Unlock process ) లో భాగంగా ప్రత్యేక రైళ్లతో పాటు కొన్ని రెగ్యులర్ ట్రైన్లు కూడా ప్రారంభమైనా..కొద్దిరోజులకు రెగ్యులర్ ట్రైన్లు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా దాదాపు 2 వందల ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఈ నేపధ్యంలో రైలు ప్రయాణాలకు భారీగా డిమాండ్ వచ్చి పడింది. దీంతో ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో పలు రూట్లలో నడిచే రైళ్ల రాకపోకలు, ఆగే స్టేషన్ల ( AP Special trains Halt stations ) వివరాలివే.  

సికింద్రాబాద్ - హౌరా, హౌరా - సికింద్రాబాద్ ( ప్రతిరోజూ ) - పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట

సికింద్రాబాద్ - గుంటూరు, గుంటూరు - సికింద్రాబాద్ ( ప్రతిరోజూ ) - నంబూరు, పెదకాకాని, కృష్ణా కెనాల్ జంక్షన్, కొండపల్లి

తిరుపతి - నిజామాబాద్, నిజామాబాద్ - తిరుపతి….రేణిగుంట, కోడూరు, రాజాంపేట, ఎర్రగుంట్ల, ముద్దునుర్, తాడిపత్రి, గూటి

హైదరాబాద్ - విశాఖ, విశాఖ - హైదరాబాద్ ( ప్రతిరోజూ ) తాడేపల్లిగూడెం, నిడదవోలు, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, దువ్వాడ

ఇతర  జోన్ల రైళ్ల వివరాలు

జైపూర్ - మైసూర్ ( సోమ - బుధవారాల్లో ) - కర్నూల్ సిటీ ,డోన్ ,ధర్మవరం

మైసూర్ - జైపూర్ ( గురు - శనివారాల్లో ) - ధర్మవరం, డోన్, కర్నూల్ సిటీ

గోరకపూర్- యశ్వంత్ పూర్ ( సోమ - శనివారాల్లో ) - ధర్మవరం

యశ్వంత్ పూర్- గోరకపూర్ ( సోమ - గురువారాల్లో ) - ధర్మవరం

ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - చాప్రా ( సోమ - శనివారాల్లో ) -  గూడూరు 

చాప్రా - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ( సోమ - బుధ వారాల్లో ) - గూడూరు..

ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- న్యూ ఢిల్లీ ( ప్రతిరోజూ ) - గూడూరు, చీరాల, తెనాలి,

న్యూ ఢిల్లీ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ( ప్రతిరోజూ ) - తెనాలి, చీరాల, గూడూరు Also read: Schools reopening in AP: స్కూల్స్ పునఃప్రారంభం వాయిదా.. జగనన్న విద్యా కానుకపై క్లారిటీ

Trending News