Modi Visakha Tour: విశాఖలో ప్రధాని మోదీ, సీఎం జగన్ పర్యటన వివరాలు ఇలా

Modi Visakha Tour: ప్రధాని మోదీ విశాఖపట్టణం పర్యటన రెండ్రోజులపాటు జరగనుంది. నవంబర్ 11, 12 తేదీల్లో జరగనున్న ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 10, 2022, 10:12 PM IST
Modi Visakha Tour: విశాఖలో ప్రధాని మోదీ, సీఎం జగన్ పర్యటన వివరాలు ఇలా

పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో భాగంగా దేశ ప్రధాని మోదీ రెండ్రోజులు విశాఖలో పర్యటించనున్నారు. ఇదే రెండ్రోజులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం విశాఖలోనే ఉండనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో రెండ్రోజులపాటు పర్యటించనున్నారు. రేపట్నించి అంటే నవంబర్ 11, 12 తేదీల్లో ప్రదాని మోదీ పర్యటన ఉంటుంది. నవంబర్ 11వ తేదీ రాత్రి మోదీ విశాఖపట్నంకు చేరుకుంటారు. అదే రోజు కంచర్లపాలెం నుంచి ఓల్డ్ ఐటీవో వరకూ చిన్న రోడ్ షో ఉంటుంది. ఈ రోడ్ షో రాత్రి 7 గంటల్నించి 8 గంటల వరకూ ఉంటుంది. రాత్రికి ఐఎన్ఎస్ చోళలో బస చేయనున్నారు. 

ఇక 12వ తేదీ ఉదయం 9 కేంద్ర ప్రభుత్వ  ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునీకరణ, ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, రాయ్‌పూర్-విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ రోడ్డు ఆధునీకరణ, శ్రీకాకుళం నుంచి ఒడిశా వరకూ గెయిల్ పైప్‌లైన్, గుంతకల్లులోని ఐవోసీఎల్ ప్రాజెక్టు జాతికి అంకితం ఉన్నాయి.

అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా రెండ్రోజుల మోదీ పర్యటనలో పాల్గొననున్నారు. నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని..అక్కడి నుంచి ఐఎన్ఎస్ డేగాకు వెళ్లి ప్రదాని మోదీకు స్వాగతం పలుకుతారు. రాత్రికి పోర్టు గెస్ట్‌హౌస్‌లో బస తరువాత..12వ తేదీ మద్యాహ్నం వరకూ ప్రధాని మోదీతో కలిసి పలు శంకుస్థాపనలు, ప్రాజెక్టు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మద్యాహ్నం ఐఎన్ఎస్ డేగాలో ప్రధాని మోదీకు వీడ్కోలు పలికి..విజయవాడకు పయనమౌతారు. 

Also read: Pawan-Modi Meet: విశాఖలో ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ, జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ వర్గాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News