హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తాజాగా ఎన్నికల గుర్తును ప్రకటించింది. 2014 మార్చి 14న పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించగా.. నాలుగేళ్ల తర్వాత ఆ పార్టీ 'గాజు గ్లాసు'ను చూపిస్తూ ఇదే తమ పార్టీ గుర్తు అంటూ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలు, తెలంగాణలోని 17 స్థానాల్లో గాజు గ్లాసు గుర్తు ద్వారానే పోటీచేయనున్నట్టు జనసేన పార్టీ ట్విటర్లో పేర్కొంది. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా జనసేనాని ప్రచారం నిర్వహించినప్పటికీ.. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎటువంటి ఎన్నికల్లోనూ ఆ పార్టీ పోటీచేయలేదు. రానున్న లోక్ సభ ఎన్నికలే ఆ పార్టీకి మొదటి సవాల్ కానున్నాయి.
JanaSena election symbol "Glass Tumbler "
జనసేన ఎన్నికల గుర్తు "గాజు గ్లాస్" pic.twitter.com/zhs69dvAVd
— JanaSena Party (@JanaSenaParty) December 22, 2018