Pawan Kalyan About Tirumala Laddu; తిరుమల లడ్డు వివాదం పై.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. “ఏడుకొండలవాడా..! క్షమించు..” అంటూ ట్విట్టర్లో.. తాను 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చెయ్యనున్నట్టు ప్రకటించారు డిప్యూటీ సీఎం.
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ అంటే హిందువులకు ఎంత ఇష్టమైనదో అందరికీ తెలిసిందే. ఈ పవిత్రమైన ప్రసాదం కి మన ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ఈ ప్రసాదంలో కల్తీపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు తీవ్రంగా మంది పడిన సంగతి తెలిసిందే. ఎంతో మనోవేదనకు గురవ్వడమే కాకుండా తన ట్విట్టర్ ద్వారా ఇప్పటికే ఈ విషయాన్ని పలుమార్లు చర్చించారు.
ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అలా అని ఇలాంటివి పునరావృతం కాకుండా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసే వైపుగా ప్రయత్నాలు సాగాలని ఆయన కోరాడు. ఈ క్రమంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ మరొక నిర్ణయానికి పూనుకున్నాడు. 11 రోజులపాటు తాను ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు.
ట్విట్టర్లో..” పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం.. గత ప్రభుత్వం వికృత పోకడల ఫలితంగా ఎంతో అపవిత్రమైంది. జంతు అవశేషాలతో తిరుమల లడ్డు మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి పాల్పడ్డారు. తిరుమల ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నేను ఎంతో బాధపడ్డాను. ప్రజా క్షేమాన్ని కోరుకొని.. పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం చాలా బాధాకరం. కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే.” అంటూ ట్వీట్ పెట్టారు.
ఇక ఆ ట్వీట్ని కొనసాగిస్తూ..” అందుకే నేను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను.
22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో నేను ఈ దీక్ష ని తీసుకుంటాను. దీక్ష అయిన తరువాత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను.” అంటూ చెప్పుకొచ్చారు.
‘దేవదేవా... నీ పట్ల గత ప్రభుత్వం చేసిన పాపాలను.. ప్రక్షాళన చేసే శక్తిని మాకు అందించమని వేడుకుంటున్నాను. భగవంతుడిపై ఎటువంటి విశ్వాసం, పాప భీతి లేనివారే ఇలాంటివి చేస్తారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడ జరుగుతున్న అన్యాయాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా.. వాటిపై స్పందించకపోవడం. ముఖ్యంగా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డులో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం నన్ను ఎంతో బాధకు గురిచేస్తుంది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది.
ధర్మో రక్షతి రక్షితః’ అంటూ పోస్ట్ చేశారు.
ఏడుకొండలవాడా..! క్షమించు
•11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం…— Pawan Kalyan (@PawanKalyan) September 21, 2024
Also Read: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
Also Read: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Pawan Kalyan: తిరుమల లడ్డుపై పవన్ సంచలన నిర్ణయం..11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష