Pawan Kalyan Silence: మీరు మారారు సార్..!

Pawan Kalyan Silence: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఈ మధ్య  సైలెంట్ అయ్యారా.. ...?అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉన్న జోష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌  లో లేదా .....?ఉన్నట్లుండి ఎందుకు సైలెంట్ అయ్యాడు....? పవన్ కళ్యాణ్‌ సైలెంట్ అయ్యాడా....?.లేక ఎవరైనా పవన్ ను వాంటెడ్ గా సైడ్ చేస్తున్నారా......?వరదల తర్వాత పవన్ లో ఏదో తేడా కొడుతుందని జన సైనికులు ఎందుకు చెప్పుకుంటున్నారు.....?.రాజకీయంలో భాగంగానే వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్‌  మౌనంగా ఉంటున్నారా లేక ఏదైనా వేరే కారణం ఉందా...? 

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Sep 16, 2024, 05:31 PM IST
Pawan Kalyan Silence: మీరు మారారు సార్..!

Pawan Kalyan Silence:  వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి వరదను ఇటీవల విజయవాడ చూసింది. ఇప్పుడిప్పుడే విజయవాడ ప్రజలు వరదల నుంచి కోలుకుంటున్నారు. కాగా అధికారంలోకి వచ్చి కనీసం ఐదు నెలలన్నా కాలేదు అప్పుడే వరదలతో ఏపీ కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్ ఎదురయ్యింది. అప్పుడప్పుడే పాలన గాడిలో పడుతుంది అనుకుంటున్న తరుణంలో వరదలు ఏపీకీ తీవ్ర నష్టం మిగిల్చాయి.  వరదల సమయంలో సీఎం చంద్రబాబు సహా అధికార యంత్రాంగం అంతా కూడా వరదల సహాయంలో నిమగ్నమయ్యారు. అయితే వరదల  సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. సీఎం చంద్రబాబు రోజుల తరబడి రాత్రింబగళ్లు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ అదే సమయంలో  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం వరదల సమయంలో ఆలస్యంగా స్పందించారనే విమర్శలు వచ్చాయి. ఒక వైపు భారీ వరదలు విజయవాడను ముంచెత్తుతుంటే పవన్ కళ్యాణ్‌ ఎక్కడా కనిపించలేదనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపించాయి.అయితే ఈ విమర్శలు వస్తుండగానే పవన్ కళ్యాణ్‌  వరదలపై అధికారులతో సమీక్ష చేస్తూ కనిపించారు. వరద ప్రాంతాల్లో తాను తిరిగితే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే తాను పర్యటించలేదని స్వయంగా పవన్ కళ్యాణే  వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే  పవన్ ను రాజకీయంగా  బద్నాం చేయడానికే వైసీపీ ఇలా చేసింది అని జనసైనికులు ఆరోపించారు. 

ఇది ఇలా ఉంటే వరదల సమయంలో సీఎం చంద్రబాబు ఒక్కడు మాత్రమే అంతా తానై వ్యవహరించారని ..సీఎం తర్వాత సీఎం ఐన డిప్యూటీ సీఎం కనిపించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద విలయాన్ని విజయవాడ చూసిందని అలాటి తరుణంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వరద బాధితులను పరామర్శించి ఉంటే బాగుండేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. గతంలో ఏ కార్యక్రమం జరిగినా చంద్రబాబుతో కలిసి పాల్గొన్న పవన్ కళ్యాణ్‌ వరదల సమయంలో మాత్రం ఎందుకు చంద్రబాబుతో కలిసి వరద బాధితులకు భరోసా కల్పించలేకపోయారనే చర్చ ఏపీ జరుగుతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్నందున ఇద్దరు ముఖ్య నేతలు కలిసి వరద బాధితుల వద్దకు వెళ్లి ఉంటే వారికి మరింత భరోసా దొరికేది...బాధితులకు మరింత మనో ధైర్యాన్ని ఇచ్చినట్లు ఉండేదని కూటమిలో చర్చ జరిగిందంట. వరదల వల్ల జరిగిన నష్టాన్ని స్వయంగా ఇద్దరు నేతలు కలిసి కేంద్రానికి వివరించి ఉంటే ఏపీకీ సత్వర న్యాయం జరిగి ఉండేదని టాక్ వారిలో నడిచింది. రోజుల తరబడి బాబు వరద ప్రాంతాల్లో పర్యటించినా పవన్ మాత్రం ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్లారనేది అక్కడి రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. అంతే కాదు వరదలపై ఇప్పటి వరకు జరిగినా రివ్యూలో ఏదో ఒక సారి మాత్రమే చంద్రబాబు, పవన్ వేదిక పంచుకున్నారు తప్పా మిగితా సమయంలో ఇద్దరు నేతలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండిపోయారు.

అంతే కాదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జన సేన అధినేత పవన్  చాలా యాక్టివ్ గా ఉండేవారు. డిప్యూటీ సీఎంగా  నిరంతరం జనాల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు. కానీ ఈ మధ్య ఏమైందో ఏమో కానీ మునుపటిలా పవన్ లో ఆ హుషారు కనపడటం లేదని జనసేనలోనే చర్చ జరుగుతుంది. ఎప్పుడూ చంద్రబాబు, పవన్ కలిసి ముఖ్యమైన రాజకీయ అంశాల్లో కలిసి నిర్ణయం తీసుకునేవారు. అలాంటిది వరదల సందర్భంలో ఇద్దరు కలిసి పెద్దగా  చర్చించిన సందర్భాలు తక్కువే అనే చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ వరదల పేరుతో జనంలోకి వస్తే ..పవన్ మాత్రం కొంత ఆలస్యంగా స్పందించారనే చర్చ జరిగింది. పవన్ లాంటి వాడు వరద ప్రాంతాల్లో తిరిగితే ఆ ప్రాంత ప్రజలకు మరింత భరోసా కల్పించినట్లు ఉండేదని అంతే కాదు రాజకీయంగా జన సేనకు కూడా మంచి ఆదరణ దక్కేదని జనసైనికులు చర్చించుకుంటున్నారు. 

అసలు వరద బాధితుల పరామర్శలోను,  వరద సమీక్షలోను పవన్ ఎందుకు ఒంటరిగా  పాల్గొన్నారనే దానిపైనే ఏపీ రాజకీయాల్లో రకరకాల చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ముఖ్య కార్యక్రమాల్లో  చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొన్నారు. కానీ వరదల సమయంలో ఇలా ఇద్దరు కీలక నేతలు వేర్వేరుగా వరద ప్రాంతాల్లో పర్యటించడం దేనికి సంకేతం అనే చర్చ ఉంది. దీనిలో ఏదైనా రాజకీయం దాగి ఉందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాదు ఇటీవల చాలా మంది ప్రముఖులు వరద బాధితుల సహాయం కోసం ముందుకు వచ్చారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు తమ సహాయాన్ని చెక్కుల రూపంలో సీఎం చంద్రబాబు అందజేశారు. చెక్కులు అందజేసే సమయంలో కూడా పవన్ అక్కడ ఎందుకు లేరనే టాక్ కూడా వినిపిస్తుంది. అసలే పవన్ కళ్యాణ్‌ సినీ పరిశ్రమకు చెందిన వాడు స్వయంగా తానే అందరినీ కలుపుకొని చంద్రబాబుకు చెక్కులు అందజేసి ఉంటే బాగుండేది కదా ఇలా ఎందుకు చేయలేదు అని సినీ పరిశ్రమలో కూడా చర్చించుకుంటున్నారు. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

పవన్ కళ్యాన్ కావాల్సుకొనే దూరంగా ఉంటున్నారా లేక పవన్ నే దూరం పెడుతున్నారనే అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.ఇటీవల జరిగిన మరో పరిణామం కూడా ఆసక్తి కలిగించింది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కు క్యాంప్ ఆఫీసుగా విజయవాడ ఇరిగేషన్ కేటాయించింది.అంతే కాదు దానిలో మరిన్న వసతుల కల్పించడానికి 80లక్షల రూపాయలు కూడా బాబు సర్కార్ కేటాయించింది. దీనిపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా తప్పుపట్టింది. పవన్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు హాట్ కామెంట్స్ కూడా చేశారు. అయితే ఏం జరిగిందో ఎమో కానీ పవన్ కళ్యాణ్‌ దీని విషయంలో ప్రభుత్వానిక బహిరంగంగానే లేఖ రాశారు. మంగళగిరిలోని తన ఇంటినే క్యాంప్ ఆఫీసుగా మార్చుకుంటానని లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై కూడా టీడీపీ, జనసేనలో కూడా తీవ్రంగా చర్చ జరిగింది. పవన్ అలా బహిరంగ లేఖ ఎందుకు రాశారా అన్న చర్చ కూడా జరిగింది. దీని తర్వాతనే పవన్ తీరు మార్పు వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. ఆ తర్వాత నుంచి పవన్ కొన్ని వ్యవహారాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తుంది. 

మరోవైపు పవన్ విషయంలో జరుగుతున్న చర్చను పవన్ సన్నిహితులు మాత్రమే కొట్టి పారేస్తున్నారు.ఈ మధ్య చంద్రబాబుతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వెనుక ఎలాంటి రాజకీయం కారణాలు లేవని స్పష్టం చేస్తున్నారు. వారి వారి షెడ్యూల్ కు అనుగుణంగా వారి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్పా దీనిలో మరీ అంతగా ఆలోచన చేయాల్సిన పనిలేదని పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.మొత్తానికి పట్టుపట్టి కూటమిగా ఏర్పడిన అధికారంలోకి వచ్చిన టీడీపీ జనసేనలు..తమ మధ్య ఎలాంటి పొరపచ్చలు రావొద్దని కోరకుంటుంది.మా మధ్య ఏదైనా చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా వాటిని సరి చేసుకుంటామని ధీమగా చెబతుంది.

మొత్తానికి వరదల తర్వాత పవన్ పై వస్తున్న సందేహాలకు త్వరలోనే ఏదైనా క్లారిటీ వస్తుందని జనసైనికులు, కూటమి నేతలు భావిస్తున్నారు. బాబు, పవన్ మధ్య కొందరు కావాలనే గ్యాప్ తేవాలని ప్రయత్నిస్తున్నారని వారి ఆశలు నెరవేరవని కూటమి గట్టిగా చెబుతుంది. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News